పింక్ లో ప‌రిమ‌ళించిన దేశీ బార్బీ!

ఖుషీ క‌పూర్ ఇన్ స్టా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. హీరోయ‌న్ గా ఎంట్రీ ఇవ్వ‌డానికి ముందే అమ్మ‌డు ఫాలోయింగ్ లోపీక్స్ కి చేరేలా ఉంది

Update: 2024-07-06 11:23 GMT

ఖుషీ క‌పూర్ ఇన్ స్టా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. హీరోయ‌న్ గా ఎంట్రీ ఇవ్వ‌డానికి ముందే అమ్మ‌డు ఫాలోయింగ్ లోపీక్స్ కి చేరేలా ఉంది. ఇప్ప‌టికే అమ్మ‌డి ఖాతాలో మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఇదంతా హీరోయిన్ కాక ముందే..ఇక న‌టిగా ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత మామ్ ఇమేజ్ తో ఇంకే స్థాయికి రీచ్ అవుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇన్ స్టా అనేది బాలీవుడ్ భామ‌ల‌కు ప్ర‌చారం ప‌రంగా ఓ వెప‌న్ లా మారిపోయింది.

ఈజీగా త‌మ‌ని తాము ఎలా ప్ర‌చారం చేసుకోవాలో? తెలివైన భామ‌లుగా వాళ్ల‌ను చెప్పొచ్చు. ఇప్ప‌టికే ఖుషీ హాట్ హాట్ అందాలతో ఎన్నో ఫోటోల‌ను పోస్ట్ చేసింది. వాటిలో సంప్ర‌దాయ షూట్లు వెతికితో దొర‌క‌డం క‌ష్టం. అలాటి ఖుషీ క‌పూర్ నుంచి ఊహించ‌ని ట్రీట్ అందేసింది. తాజాగా అమ్మ‌డు పింక్ సారీలో ప‌రిమ‌ళించిన తీరు చూస్తే వావ్ అనాల్సిందే. ఆ రేంజ్ లో ఖుషీ క‌వ్వించేస్తోంది.

పింక్ సారీపై మ్యాచింగ్ బ్లౌజు ధ‌రించి ఆ చీర‌కే వ‌న్న తీసుకొచ్చింది. పింక్ డిజైన్ పై స‌న్న‌ని మెరుపు మ‌రింత అందంగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇక బ్లౌజ్ ని రెగ్యుల‌ర్ డిజైన్ కి భిన్నంగా డిజైన్ చేసింది. స్లీవ్స్ ని క‌వ‌ర్ చేస్తూ షోల్ల‌ర్ ని ప్రీ చేసింది. నెక్..చెవుల‌కు ఎంపిక చేసుకున్న యాక్స‌రసీస్ మ‌రింత అందంగా మ‌లిచాయి. మొత్తంగా ఖుషీ నుంచి ఇదొక ప్రెష్ ఫీల్ నిండిన పిక్ అనొచ్చు.

గ‌తంలోనూ చీరందంలో మురిపించింది. కానీ పింక్ సారీ ప్ర‌త్యేక‌త ఎంతైనా ఆ రంగుకే సొంత క‌దా. ప్రస్తుతం ఖుషీ క‌పూర్ న‌టిగా బిజీ అవుతుంది. క‌ర‌ణ్ జోహార్ బ్యాన‌ర్ లోనే అమ్మ‌డు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఆ ప్రాజెక్ట్ ప‌నుల్లోనే కొన్ని నెల‌లుగా బిజీగా ఉంది. జాన్వీ క‌పూర్ కెరీర్ సెట్ అయిన నేప‌థ్యంలో డాడ్ బోనీ క‌పూర్ ఖుషీ పై దృష్టి పెట్టి ప‌నిచేస్తున్నారు.

Tags:    

Similar News