న్యూ హెయిర్ స్టైల్.. ఆరు రౌండ్లు భలే తిప్పిందే!
అతిలోక సుందరి శ్రీదేవి మరో స్వీట్ డాటర్ ఖుషీ కపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.
అతిలోక సుందరి శ్రీదేవి మరో స్వీట్ డాటర్ ఖుషీ కపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అమ్మడి కొత్త ఫోటోలు ఎప్పటికప్పుడు నెట్టింట కాక పుట్టిస్తుంటాయి. చిట్టిపొట్టి దుస్తుల్లో ఖుషీ ఒదిగిపోతున్న వైనం యువతరం నిత్యం హాట్ టాపిక్. నవ నాయిక అందాల ఆరబోత హైలైట్ అవుతుంది. ఆల్ట్రామోడ్రన్ బ్యూటీగానూ అగ్గిరాజేస్తుంది. తాను ఏం చేసినా సంథిగ్ స్పెషల్ గా ఫోకస్ అవ్వాలని చూస్తుంది.
తాజాగా ఖుషీ కపూర్ న్యూహెయిర్ స్టైల్ పిక్ ఒకటి అంతర్జాలంలోకి వచ్చేసింది. ఇందులో ఖుషీ హెయిర్ మొత్తాన్ని నాలుగైదు ఉండలుగా చుట్టి మధ్యలో రబ్బర్ బ్యాండ్లు పెట్టి కొత్తగా ట్రై చేసింది. తల మొత్తాన్ని ఓ ఆరేడు ఉండలు చుట్టి ఇలా ట్రై చేసింది. రొటీన్ కి భిన్నమైన స్టైల్ కాస్త స్టైలిష్ గానే ఉంది. అంతే స్టైల్ గా కెమెరాకి ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ మిర్రర్ పోజు నెట్టింట వైరల్ గా మారింది. ఖుషీ ఒక్కసారిగా ఇలా చేస్తే అమె ఖుషీనా? మరో నటి నా? అని డౌట్ రావడం సహజం.
ఈ ఫోటోని ఉద్దేశించి ఖుషీ ఓ ఇంట్రెస్టింగ్ కొటేషన్ కూడా ఇచ్చిందండోయ్.` నా వేలో నేను..నేను చేస్తున్నది` ఇదే అన్నట్లు ఏదో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గామారింది. అమ్మడి హెయిర్ స్టైల్ పై రకరకాల కామెంట్లు పడుతున్నాయి. ఇంతవరకూ ఇలాంటి డిఫరెంట్ హెయిర్ స్టైల్ కూడా ఖుషీ ట్రై చేయలేదు. దీంతో న్యూలుక్ సూపర్బ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఖుషీ కెరీర్ సంగతి చూస్తే ఇప్పటికే `ది అర్చిస్` తో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
అయితే అది ఓటీటీకే పరిమితమైంది. హీరోయిన్ గా మ్యాకప్ వేసుకోవడానికి రెడీ అవుతుంది. పరిచయం చేసే బాధ్యత కరణ్ జోహార్ తీసుకున్నాడు. తన బ్యానర్లోనే హీరోయిన్ గా లాంచ్ చేస్తున్నాడు. తొలి సినిమాకంటే ముందే రెండవ సినిమా కూడా అదే బ్యానర్ లో అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇది కరణ్ మార్క్ బిజినెస్ స్ట్రాటజీ. జాన్వీ కపూర్ ని కూడా కరణ్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే.