స్కైలో కియరా .. తెలుగు నిర్మాతలు తట్టుకోగలరా?
దీపిక పదుకొనే, ఆలియా లాంటి కథానాయికలకు 10 కోట్లు పైగా చెల్లిస్తున్నారని ప్రచారం ఉంది.
ఈరోజుల్లో స్టార్ల పారితోషికాలకే నిర్మాతలు బడ్జెట్లో రెండొంతులు వెచ్చించాల్సి వస్తోంది. స్టార్ హీరో- స్టార్ డైరెక్టర్ పారితోషికాలతోనే సగం పెట్టుబడి గాయబ్ అయిపోతోంది. ఇప్పుడు కథానాయికలు కూడా భారీ మొత్తాలను అందుకుంటూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. 10 కోట్లు అంతకుమించిన పారితోషికాలు అందుకుంటున్న కథానాయికలు పరిశ్రమలో అరడజను మంది ఉన్నారు. దీపిక పదుకొనే, ఆలియా లాంటి కథానాయికలకు 10 కోట్లు పైగా చెల్లిస్తున్నారని ప్రచారం ఉంది.
అయితే డాన్ 3లో రోమా పాత్రను పోషిస్తున్నందుకు గానూ కియరాకు 13 కోట్ల రూపాయల పారితోషికం అందజేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఇది నిజమా కాదా? అన్నది ఇప్పుడే కన్ఫామ్ చేయలేం. ఒకవేళ ఇదే నిజమైతే కల్కి (ప్రాజెక్ట్ కే) కోసం దీపిక 18కోట్లు అందుకుంటోందని కథనాలు వచ్చాయి.. ఇప్పుడు కియరా కూడా 10 కోట్ల క్లబ్ లో చేరినట్టే. అయితే ఒక సోర్స్ ప్రకారం... నటీనటులతో నిర్మాతలు ఇంకా ఎటువంటి పారితోషికం గురించి చర్చించలేదు.. రణ్‌వీర్ సింగ్ (టైటిల్ రోల్ పోషిస్తున్నది) కి కూడా పారితోషికం నిర్ణయించలేదని తెలిసింది.
డాన్ 2లో నటించిన ప్రియాంక చోప్రా కోసం చెల్లించినది డాన్ 3 లో నటిస్తున్న కియారా అద్వానీ అందుకునే దానిలో సగం కూడా ఉండదని ఒక సోర్స్ చెబుతోంది. ఈ చిత్రాన్ని ఫర్హాన్ అక్తర్ తన సొంత బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనున్న సంగతి తెలిసిందే. తెలుగులో తొలి సినిమా కోసం లక్షల్లో అందుకున్న కియరా రేంజ్ ఆ తర్వాత 3 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు 10కోట్లు అధిగమించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. తెలుగు నిర్మాతలు కియరా రేంజు చూసి నోరెళ్లబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.