షాకింగ్‌ : కియారా వెంట వీధి కుక్క

ఈ మధ్య కాలంలో వార్తల్లో వీధి కుక్కల బారిన పడి చిన్న పిల్లలు చనిపోతున్నట్లు చూస్తూనే ఉన్నాం

Update: 2024-05-19 05:04 GMT

ఈ మధ్య కాలంలో వార్తల్లో వీధి కుక్కల బారిన పడి చిన్న పిల్లలు చనిపోతున్నట్లు చూస్తూనే ఉన్నాం. క్రమం తప్పకుండా వారం పది రోజులకు ఒకటి చొప్పున అలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. పెద్ద వారు కూడా ఒంటరిగా వీధుల్లో తిరగలేని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంది.

ఇప్పుడు ముంబై ఎయిర్‌ పోర్ట్‌ లో కూడా కుక్కల భయం మొదలు అయ్యింది. స్టార్‌ హీరోయిన్‌ కియారా అద్వానీ కి కుక్కతో ప్రమాదం తృటిలో తప్పింది. సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే... కియారా అద్వానీ ముంబై ఎయిర్‌ పోర్ట్‌ లో మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఆమె వెనుక కుక్క వచ్చింది.

ఎక్కడి నుంచి వచ్చిందో ఆ వీధి కుక్క కియారాకు అడుగు దూరం వరకు వచ్చింది. సెక్యూరిటీ వారు ఏమరపాటు తో ఉంటే కచ్చితంగా కుక్క కాటు కియారాకి పడేది. కుక్క నుంచి సెక్యూరిటీ వారు మరియు అక్కడ ఉన్న మీడియా వారు కియారా ను కాపాడారు.

కుక్క తన పైకి రాబోయే విషయం గమనించిన కియారా ఒక్క సారిగా షాక్ అయ్యింది. అదిరిపడిన కియారా కొన్ని సెకన్ల పాటు వనికి పోయింది. ప్రస్తుతం కియారా వెంట కుక్క పడ్డ వీడియోలు మరియు ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఎయిర్‌ పోర్ట్ లోకి కుక్కలు రావడం ఏంటి అంటూ కియారా అద్వానీ ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక కియారా అద్వానీ సినిమాల విషయానికి వస్తే తెలుగు లో రామ్‌ చరణ్ కి జోడీగా గేమ్‌ చేంజర్ సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. గతంలో తెలుగు లో భరత్‌ అనే నేను మరియు వినయ విధేయ రామ సినిమాల్లో కియారా నటించింది.

పెళ్లి తర్వాత కాస్త స్లో అవుతుందని అంతా అనుకున్నా కూడా బాలీవుడ్‌ లో ఈమె జోరు మరింతగా పెరిగింది. రాబోయే ఏడాది కాలంలో ఈమె నుంచి మూడు నాలుగు సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

Tags:    

Similar News