శంకర్ సర్ గత చిత్రాల కంటే బెస్ట్ ఇస్తారు
దానికోసం చాలా నిబద్ధతతో పని చేస్తున్నారని కియరా అద్వాణీ ప్రశంసలు కురిపించారు.
తన కెరీర్ లో ఇప్పటివరకూ చాలా ఎక్కువ శ్రమించిన పాట 'జరగండి' (గేమ్ ఛేంజర్) గురించి వర్ణించారు కియరా అద్వాణీ. రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ లోని ఈ పాట కోసం ఏకంగా 10 రోజులు పని చేసానని తెలిపారు. ఒక పాట కోసం ఇన్ని రోజులు పని చేయడం ఇదే తొలిసారి. శంకర్ సర్ పాటల్ని ఎంతో ప్యాషనేట్ గా తెరకెక్కిస్తారు. ఆయనకంటూ ఒక విధానం ఉంది. తన కెరీర్ లోనే బెస్ట్ సినిమాని అందించాలని అనుకుంటున్నా. దానికోసం చాలా నిబద్ధతతో పని చేస్తున్నారని కియరా అద్వాణీ ప్రశంసలు కురిపించారు.
ఇటీవలే విడుదలైన జరగండి పాటకు అద్భుత స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ పాట మేకింగ్ కోసం శంకర్ బృందం ఎంతగా శ్రమించిందో, ఎంతగా దృష్టి సారించిందో కియారా వర్ణించి చెప్పారు. ఫిల్మ్ కంపానియన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కియారా మాట్లాడుతూ.. ఈ పాట కోసం తాను వంద శాతం హార్డ్ వర్క్ చేసానని.. అందులో తన పనికి చాలా ప్రశంసలు లభించాయని తెలిపారు. పాటలో తన హావభావాల వ్యక్తీకరణపై దర్శకుడు శంకర్ తనను ప్రశంసించారని కూడా అన్నారు.
మాస్ సాంగ్ చేయడం సరదాగా ఉంది.. నా జీవితంలో ఇలాంటివి చేయలేదు.. జరగండి పాట విడుదలైన తర్వాత నాకు ఎక్కువ ఫోన్ కాల్స్ వచ్చాయి.. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరూ ఇలా లేరు. నేను హీరోతో కలిసి డ్యాన్సులు చేసాను కానీ...దర్శకుడు కూడా ఇంతగా పాటపై దృష్టి సారించడం చూడలేదు. ఈ మసాలా సాంగ్‌లో నేను చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉన్నానని శంకర్ సర్ చెప్పారు.. ఇది మేము చేసిన మొదటి పాట.. చిత్రంలోని ప్రతి పాట దేనికదే భిన్నంగా ఉంటుంది అని కియరా తెలిపారు. నిజంగా జరగండి చాలా కష్టతరమైనది..నేను నటించిన అత్యంత కష్టతరమైన పాట ఇది. ప్రభుదేవా సార్ కొరియోగ్రాఫర్.. చాలా రిహార్సల్స్ చేశాం. సాంగ్‌లో చాలా బ్యాక్‌బ్రేకింగ్ స్టెప్స్ ఉన్నాయి. చరణ్‌ని ప్రభుదేవా సార్ ప్రిపేర్ చేయించారు... నేను కూడా అదే చూసి చేశాను. నేను వారితో సరిపోలాలి కదా! చాలా శ్రమించాను అని వివరించింది. షూటింగ్ మొత్తం అనుభవం తనకు నచ్చిందని చెప్పింది.
శంకర్ సర్‌తో కలిసి పనిచేయాలనుకున్నాను. ఆయన చాలా ప్యాషనేట్ ఫిల్మ్‌మేకర్. తన దృష్టి పెద్దది. ఏదో ఒకటి భారీతనంతో చేయాలని ప్రయత్నిస్తున్నారు.. కానీ అదే సమయంలో ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. శంకర్ సర్ తన మునుపటి చిత్రాల కంటే మెరుగ్గా ఉండాలని ప్రయత్నిస్తున్నారు! అని వివరించింది.
గేమ్ ఛేంజర్ పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. సెప్టెంబర్‌లో సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.