పిల్లల దావుదీ డాన్స్‌కి ఎన్టీఆర్ కామెంట్
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయిన ఈ సినిమాకు నార్త్ ఇండియాలో ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కలేదు. కానీ ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత అందరి దృష్టిని ఆకర్షించింది. హిందీ భాషలోనూ దేవర సినిమాను అత్యధికులు చూసినట్లుగా తెలుస్తోంది. ఇక అనిరుధ్ అందించిన సంగీతం ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. ఉన్నవి కొన్ని పాటలే అయినా మంచి రెస్పాన్స్ దక్కింది. అందుకే ఏ స్టేజ్ మీద చూసినా దేవర పాటలకు డాన్స్‌లు మనం చూడవచ్చు.
తాజాగా ఒక స్కూల్ ఈవెంట్‌లో పిల్లలు అంతా కలిసి దేవర సినిమాలోని దావుదీ పాటకు డాన్స్ చేశారు. ఎన్నో వేల వీడియోలు ఇలాంటివి సోషల్ మీడియాలో ఉంటాయి. కానీ కొన్ని వీడియోలు అప్పుడప్పుడు ఇలా ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఆ వీడియోలో కనిపించే ఒక కుర్రాడు చేస్తున్న డాన్స్‌కి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఎన్టీఆర్ సైతం ఈ వీడియోను చూసి పిల్లలు భళే వేశారు అంటూ మురిసి పోయినట్టు ఉన్నాడు. అందుకే అద్భుతంగా డాన్స్ చేశారు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ పెట్టాడు. అంతే కాకుండా లవ్ ఈమోజీని షేర్ చేయడం ద్వారా తన ప్రేమను చూపించాడు.
ఎన్టీఆర్ చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి వీడియోలను స్పందిస్తూ ఉంటారు. చిన్న పిల్లలు అంత కఠినమైన స్టెప్స్‌ను చాలా సింపుల్‌గా అంత మంది ముందు వేస్తూ ఉంటే చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది. అందుకే ఎన్టీఆర్ ఆ పిల్లల డాన్స్‌కి ఫిదా అయ్యాడు. తన ప్రేమను ఆ పిల్లలపై చూపించాడు. ఎన్టీఆర్ స్పందించిన ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 16 మిలియన్‌ల వ్యూస్ సొంతం చేసుకుంది. 23 లక్షల మంది లైక్ చేశారు. కొన్ని లక్షల మంది పాటను సోషల్ మీడియా ద్వారా తమ వారికి షేర్ చేసుకున్నారు.
ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా ఇంకా పూర్తి కాకుండానే ఈ నెల మూడో వారం నుంచి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టబోతున్నాడు. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ను చాలా విభిన్నంగా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మొదటి షెడ్యూల్‌ను కర్ణాటకలో చిత్రీకరించబోతున్న చిత్ర యూనిట్ సభ్యులు మెజార్టీ పార్ట్ షూటింగ్‌ను విదేశాల్లో జరుపబోతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ దాదాపు 75 శాతం విదేశాల్లో షూట్ చేయబోతున్నారు. త్వరలో ఈ సినిమా అధికారిక ప్రకటన వెలువడనుంది.