సూపర్‌ హిట్‌ మూవీ తెలుగు వెర్షన్ ఓటీటీ అప్డేట్‌!

సినిమాకు వస్తున్న స్పందన, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సౌత్ భాషల్లోనూ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు.

Update: 2024-09-24 08:42 GMT

బాలీవుడ్‌ లో సూపర్‌ హిట్ అయిన కిల్‌ సినిమా ప్రస్తుతం ఓటీటీ లో టాప్‌ లో ట్రెండ్‌ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కిల్‌ సినిమా సెప్టెంబర్‌ 6 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెల్సిందే. సినిమాకు వస్తున్న స్పందన, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సౌత్ భాషల్లోనూ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు. డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లోనే ఈ సినిమా యొక్క తెలుగు, తమిళ వర్షన్ లు స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు జరిగినట్లుగా తెలుస్తోంది.

సెప్టెంబర్‌ 24 నుంచి కిల్ సినిమా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. చిన్న బడ్జెట్‌ సినిమాగా రూపొందిన కిల్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దాదాపుగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లోనూ స్క్రీనింగ్ చేయడం జరిగింది. సినిమా విడుదల అయి చాలా రోజులు అవుతున్నా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు సౌత్‌ భాషల్లోనూ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ కాబోతున్న నేపథ్యంలో కిల్ కి మరింత క్రేజ్ దక్కే అవకాశాలు ఉన్నాయి.

ఇటీవల విడుదల అయిన సినిమాల్లో అత్యంత హింసాత్మక సినిమాగా, యాక్షన్ థ్రిల్లర్ గా నిలిచిన 'కిల్‌' సినిమా కథ మొత్తం రైలులో సాగుతుంది. ఢిల్లీ నుంచి రాంచీకి వెళ్లే రైలు లో బంధిపోట్లు దాడికి పాల్పడి ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ సమయంలో హీరో ఎలా బంధిపోట్లను ఎదిరించాడు అనేది కథ. చాలా విభిన్నమైన కథ అవ్వడంతో పాటు దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ రూపొందించిన విధానం చాలా బాగుంది అంటూ కామెంట్స్ వచ్చాయి. సినిమా విడుదల సమయంలో యావరేజ్ టాక్‌ వచ్చినా రోజులు గడిచినా కొద్ది సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి.

కథలో ట్విస్టులు, వణుకు పుట్టించే స్క్రీన్‌ ప్లే తో సినిమా సాగిన విధానం థ్రిల్లింగ్‌ సినిమాలు ఇష్టపడే వారికి కచ్చితంగా నచ్చుతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సూపర్ హిట్‌ టాక్ దక్కించుకున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ లోనూ అంతకు మించి అన్నట్లుగా ఆధరణ దక్కించుకుంటుంది. ఈ మధ్య కాలంలో థియేటర్ రిలీజ్ అయిన సమయంలో చూసే ప్రేక్షకుల కంటే ఎక్కువగా ఓటీటీ లో చూస్తున్నారు. అందుకే అన్ని భాషల్లోనూ ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేయడం జరిగింది. ఇన్ని రోజులుగా హిందీ వర్షన్ ట్రెండ్‌ అవ్వగా ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లోనూ ట్రెండ్‌ అవ్వబోతుంది.

Tags:    

Similar News