హిట్ మూవీ మేకర్స్ తెలివి తక్కువ పని..!
గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ సినిమా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.
గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ సినిమా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఒకప్పుడు సినిమాలు థియేటర్ లో ఎక్కువ రోజులు ఆడేవి. కానీ ఇప్పుడు రెండు మూడు వారాలు మాత్రమే ఉంటున్నాయి. హిట్ అయితే మరో రెండు మూడు వారాలు ఎక్కువగా ఉంటున్నాయి.
థియేటర్ రిలీజ్ అయినప్పటికీ ప్రేక్షకులు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు. థియేటర్ లో సినిమా ఉన్నప్పుడు ఓటీటీ లోకి వస్తే ఇక థియేటర్ కి ఎవరు వెళ్లరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే థియేటర్ ఫుల్ రన్ తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ చేయడం మొదలు పెడుతున్నారు.
కొన్ని సినిమాలు మాత్రం థియేటర్ లో ఉండగానే ఓటీటీలోకి వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ హిట్ మూవీ 'కిల్' ను కూడా ఓటీటీ లోకి తీసుకు వచ్చారు. థియేట్రికల్ రిలీజ్ అయ్యి నాలుగు వారాలు కూడా కాకుండానే ప్రైమ్ వారు రెంటల్ పద్దతిలో సినిమా ను అందుబాటులోకి తీసుకు వచ్చారు.
సినిమా వెంటనే ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయ్యింది. ఇండియాలో పెద్ద ఎత్తున పైరసీ ఉందనే విషయం తెలిసి కూడా ఇంకా థియేటర్ లో ఉండగానే కిల్ ను ఓటీటీ స్ట్రీమింగ్ చేయడం తప్పుడు నిర్ణయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
హెచ్‌డి క్వాలిటీ ప్రింట్ ఆన్ లైన్ లో ఉండటంతో చాలా మంది ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకుని చూస్తున్నారు. థియేటర్ లో చూడాలి అనుకున్న వారు కూడా ఇప్పుడు ఆన్ లైన్ లో చూస్తున్నారు. మరికొన్ని రోజులు బాక్సాఫీస్ వద్ద మంచి ప్రభావం చూపించే అవకాశం ఉన్నా కూడా మేకర్స్ తెలివి తక్కువ పని వల్ల వసూళ్లు తగ్గాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.