రానాకి కోపం తెప్పించిన ఆ హీరోయిన్ ఎవరు..?

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో అభిలాష్ జోషి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కింగ్ ఆఫ్ కోత

Update: 2023-08-14 05:43 GMT

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో అభిలాష్ జోషి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కింగ్ ఆఫ్ కోత. పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు. ఆదివారం కింగ్ ఆఫ్ కోత సినిమా ప్రె రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. న్యాచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి ఇద్దరు ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఈవెంట్ లో మాట్లాడిన నాని దుల్కర్ నిజమైన పాన్ ఇండియా యాక్టర్ అని అతని కోసం అన్ని భాషల దర్శకులు కథలు రాస్తున్నారని అన్నారు.

ఇక ఇదే ఈవెంట్ లో రానా మాటలు కూడా ఆసక్తికరంగా మారాయి. యాక్టింగ్ కోర్స్ లో దుల్కర్ తన జూనియర్ అని అప్పటి నుంచి తనతో మంచి రిలేషన్ ఉందని దుల్కర్ ఎంత మంచి వాడంటే ఓ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటిస్తుంది. అతనితో సీన్ చేస్తూ షాట్ రెడీ అన్నా సరే ఆమె ఫారిన్ లో ఉన్న హస్బండ్ తో ఫోన్ మాట్లాడుతుంది అది కూడా అతను చేస్తున్న షాపింగ్ గురించి.. ఆమె మాట్లాడినంత సేపు అదే ఎండలో దుల్కర్ అలానే ఉన్నాడు. ఆ సీన్ పూర్తి చేసేందుకు ఆమె ఎన్ని టేకులు తీసుకున్నా దుల్కర్ మాత్రం అలానే ఉన్నాడు.

సీన్ పూర్తయ్యాక ఆమె కార్ లో వెళ్లగా తనకే కోపం వచ్చి నీళ్ల బాటిల్ విసిరేశా కానీ దుల్కర్ మాత్రం ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. ఆమె వెళ్లాక తన ఇన్నోవాలో తన అసిస్టెంట్ తో కారు ఎక్కి వెళ్లాడు. అతను ఎంత మంచివాడు అన్నది చెప్పడానికి ఇదొక్కటి చాలు. దుల్కర్ కి ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఈ సినిమాతో దుల్కర్ తెలుగులో మరో హిట్ అందుకోవాలని అన్నారు రానా.

అయితే ఈ ఈవెంట్ లో ఆ హీరోయిన్ పేరు ప్రస్తావించకుండా రానా ఆమె మీద తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే దుల్కర్ తో చేసిన బాలీవుడ్ నటి ఎవరు అని సెర్చ్ చేస్తే రానా చెప్పింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ అని తెలుస్తుంది. దుల్కర్ సల్మాన్ తో సోనమ్ కపూర్ ది జోయా ఫ్యాక్టర్ సినిమాలో నటించింది. 2019లో వచ్చిన ఈ సినిమాను అభిషేక్ శర్మ డైరెక్ట్ చేశారు.

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి వారసుడిగా తన మార్క్ నటనతో ఆకట్టుకుంటున్న దుల్కర్. తానొక స్టార్ హీరో తనయుడిని అన్న భావన లేకుండా సినిమా అవుట్ పుట్ కోసం కష్టపడుతుంటాడు. రానా చెప్పిన ఇన్సిడెంట్ లో వేరే స్టార్ ఉంటే ఎలా ఉండేదో కానీ సీన్ పూర్తయ్యే దాకా ఎంతో ఓపికగా ఉన్న దుల్కర్ సల్మాన్ గురించి తెలుసుకున్న అతని ఫ్యాన్స్ దుల్కర్ మీద మరింత గౌరవం ఏర్పరచుకుంటున్నారు. తెలుగులో ఆల్రెడీ దుల్కర్ కి వరుస హిట్లు పడుతున్నాయి.

Tags:    

Similar News