కిరణ్ అబ్బవరం 'క'.. పెద్ద టాస్క్ కంప్లీట్

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం.. ఈ టాలీవుడ్ యంగ్ హీరోకి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.

Update: 2024-09-24 14:57 GMT

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం.. ఈ టాలీవుడ్ యంగ్ హీరోకి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. రాజావారు రాణిగారు మూవీతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన ఆయన.. ఎస్ ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే వంటి పలు సినిమాలతో మెప్పించారు. గత ఏడాది రెండు సినిమాల్లో నటించగా.. అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయారు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో 'క'(KA)చిత్రంతో సందడి చేయనున్నారు కిరణ్ అబ్బవరం.

తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో కూడా 'క' మూవీ రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే 1970స్‌ బ్యాక్ డ్రాప్, ఆంధ్రప్రదేశ్‌ లోని కృష్ణగిరి గ్రామం నేపథ్యంతో సాగే పీరియాడిక్ థ్రిల్లర్‌ గా ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీకి సుజీత్‌, సందీప్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఆ సినిమాతో టాలీవుడ్ లోకి డైరెక్టర్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి.. భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.

తాజాగా 'క' మూవీ మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ కంప్లీట్ అయినట్లు వెల్లడించారు. అనేక సుందరమైన ప్రదేశాలు.. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఒక గొప్ప ప్రయాణం అని ట్వీట్ చేశారు. షూటింగ్ సెట్స్ లో కంప్లీట్ టీమ్ దిగిన పిక్స్ ను షేర్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో పర్ఫెక్ట్ విలేజ్ సెటప్ కనిపిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మేకర్స్ వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయని ప్రకటించారు. దీంతో మూవీ కోసం వెయిటింగ్ అని సినీ ప్రియులు చెబుతున్నారు.

అయితే ఇప్పటికే 'క' సినిమా నుంచి మేకర్స్ విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ మంచి రెస్సాన్స్‌ దక్కించుకున్నాయి. మూవీపై పాజిటివ్ బజ్ కూడా క్రియేట్ చేశాయి. అదే జోష్ తో మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ ప్రోమో ఆకట్టుకుంది. మూవీ టీజర్ లో పోస్ట్ మ్యాన్ గా కనిపించారు కిరణ్ అబ్బవరం. ఆయన లుక్ కొత్తగా అనిపించింది. సినిమాలో కిరణ్ అబ్బవరం పాజిటివ్ క్యారెక్ట‌ర్‌ లో క‌నిపించనున్నారా లేదా నెగెటివ్ షేడ్స్ క్యారెక్ట‌ర్ చేస్తున్నారా అనేది టీజర్ ద్వారా మేకర్స్ సస్పెన్స్ క్రియేట్ చేశారు.

ఇక సినిమా విషయానికి వస్తే.. సామ్ సీఎస్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రానున్న 'క' మూవీ.. అక్టోబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీపావళి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. తెలుగులో నిర్మాత నందిపాటి వంశీ విడుదల చేయనుండగా.. మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేస్తున్నారు. మరి 'క' మూవీతో కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News