టాలీవుడ్ హీరో హీరోయిన్ నిశ్చితార్థం.. వైరల్ పిక్!

ఇంతకుముందు కొన్నిసార్లు అతని ప్రేమపై కొన్ని గాసిప్స్ అయితే వచ్చాయి. కానీ దానిపై ఎప్పుడూ స్పందించలేదు

Update: 2024-03-13 18:13 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల ఊహించని విధంగా అందరిని ఆశ్చర్యాన్ని కలిగించాడు. హీరోయిన్ తో ప్రేమలో పడిన అతను పెళ్లి చేసుకోబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంతకుముందు కొన్నిసార్లు అతని ప్రేమపై కొన్ని గాసిప్స్ అయితే వచ్చాయి. కానీ దానిపై ఎప్పుడూ స్పందించలేదు.

బహుశా ఆ వార్తలు నిజం కాకపోవచ్చు అని కూడా అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా హఠాత్తుగా ఎంగేజ్మెంట్ వార్తతో అతను హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఇక మొత్తానికి కిరణ్ ఇష్టపడిన హీరోయిన్ తోనే ఈరోజు నిశ్చితార్థం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

కిరణ్ మొదటి సినిమా రాజా వారు రాణి గారు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాలో నటించిన రహస్య ఘోరక్ తో ప్రేమలో పడ్డ కిరణ్ ఇప్పుడు ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యాడు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. ఇక కిరణ్ అబ్బవరం కు సన్నిహితులుగా ఉండే మరికొందరు యువ దర్శకులు అలాగే నటీనటులు కొందరు వేడుకకు హాజరైనట్లు సమాచారం.

ఇక త్వరలోనే కిరణ్ తన ప్రేయసితో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోబోతున్నాడు. గోవాలో వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అతని మొదటి సినిమా రాజావారు రాణి గారు కమర్షియల్ గా సక్సెస్ కావడమే కాకుండా నటుడుగా కూడా అతనికి మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఇక ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే సినిమా కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది.

దీంతో సోలోగా ఇండస్ట్రీలోకి మరో కొత్త హీరో వచ్చాడు అని ఓవర్గం ప్రేక్షకులు అతనికి బాగా సపోర్ట్ చేశారు. ఇక కిరణ్ కూడా జనాలకు దగ్గరయ్యే విధంగా తన ప్రతి సినిమాను ప్రమోట్ చేస్తూ వచ్చాడు. మధ్యలో కొన్ని డిజాస్టర్స్ ఎదురైనప్పటికీ కూడా అతని కాన్ఫిడెన్స్ అయితే తగ్గలేదు.

మైత్రి మూవీ మేకర్స్ గీతా ఆర్ట్స్ లాంటి సంస్థలలో కూడా అతను సినిమాలు చేశాడు. అయితే చివరగా అతని నుంచి గత ఏడాది రూల్స్ రంజన్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా దారుణంగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొన్ని కథలపై చర్చలు జరుపుతున్న ఈ హీరో సరికొత్తగా పెళ్లి తర్వాత మళ్లీ సినిమా కెరియర్ తో బిజీ కాబోతున్నాడు.

Tags:    

Similar News