బిగ్ బాస్ 8 : వైట్ హార్ట్.. బ్లాక్ హార్ట్.. టైటిల్ కొట్టాలని అతన్ని కోరిన సీత..!

బిగ్ బాస్ సీజన్ 8 లో ఆరో వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తైంది. ముందు నుంచి చెబుతున్నట్టుగానే సీత హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది

Update: 2024-10-14 05:05 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో ఆరో వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తైంది. ముందు నుంచి చెబుతున్నట్టుగానే సీత హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. మొదటి 3 వారాలు తన ఆటతో మెప్పించి ఫైటర్ అనిపించుకున్న సీత రెండు వారాలుగా వెనకబడిపోయింది. ఇక లాస్ట్ వీక్ నామినేషన్స్ లో పాత కంటెస్టెంట్స్ అంతా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్లే నామినేట్ అయ్యారు. వైల్డ్ కార్డ్ లో కూడా మెహబూబ్, గంగవ్వ నామినేషన్స్ లో ఉన్నారు. ఫైనల్ గా సీత ఎలిమినేట్ అయ్యింది.

ఐతే వెళ్తూ వెళ్తూ సీతకు వైట్ హార్ట్, బ్లాక్ హార్ట్ అంటూ ఒక చిన్న పని చేసి పెట్టాలని నాగార్జున అనగా.. విష్ణు ప్రియ, నబీల్, అవినాస్ లకు వైట్ హార్ట్ ఇచ్చింది. ఇక బ్లాక్ హార్ట్ లు నిఖిల్, నైనిక, గౌతం లకు ఇచ్చింది. అంతేకాదు నబీల్ ని టైటిల్ కొట్టాలని ప్రోత్సహించింది సీత. అతను జెన్యూన్ గా ఆడుతున్నాడని చెప్పింది.

ఇక సీత ఎలిమినేషన్ వల్ల ఆమెకు క్లోజ్ గా ఉన్న విష్ణు ప్రియ ఏడ్చేసింది. నబీల్ కూడా కొంత బాధపడ్డాడు. మిగతా పాత కంటెస్టెంట్స్ కూడా సీత ఎలిమినేషన్ వల్ల కాస్త డల్ గా కనిపించారు. సీజన్ 8 ఆదివారం వచ్చింది అంటే సందడి మొదలైనట్టే. నిన్న దసరా సందర్భంగా రాయల్ క్లాన్, ఓజీ క్లాన్ రెండు క్లాన్ లతో టాస్క్ ఆడించిన నాగార్జున ఈ టాస్కుల్లో విన్ అయిన రాయల్ క్లాన్ లకు స్వీట్స్ పం గెలుచుకోగా వాటిని మిగతా హౌస్ మెట్స్ తో కూడా పంచుకునే ఛాన్స్ ఇచ్చాడు.

అంతేకాదు నిన్న దసరా కానుకగా హీరోయిన్స్ తో ఆట పాటలు మెప్పించాయి. విశ్వం సినిమా నుంచి శ్రీను వైట్ల, గోపీచంద్ బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేశారు. శ్రీను వైట్ల, నాగార్జున ఇద్దరు కింగ్ సినిమా విశేషాలను గుర్తు చేసుకున్నారు. బిగ్ బాస్ 8 లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న సీత ఆరో వారానికే హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందని అనుకోలేదు. ఐతే హౌస్ లో అందరితో ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. అందుకే ఆమె ప్రతి చిన్న విషయానికి కన్నీళ్లు పెడుతుంది.

Tags:    

Similar News