ట్రెండీ టాక్: క్లిన్ కారా రియల్ గేమ్ ఛేంజర్!
క్లిన్ కారా అడుగుపెట్టిన వేళా విశేషమో ఏమో కానీ.. ఇంతకుముందు చిరంజీవిని ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్ పురస్కారం వరించింది
కొణిదెల ఇంట క్లిన్ కారా ఏ సమయాన అడుగుపెట్టిందో కానీ, ఆ కుటుంబానికి అన్నీ కలిసొస్తున్నాయ్. ఇటీవల దేనిలోనూ అపజయం అన్నదే లేదు. మెగా ఫ్యామిలీ అప్రతిహత జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. వరుసగా మెగా హీరోలు అరుదైన విజయాలను సాధిస్తూ, గొప్ప గౌరవాన్ని అందుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కల్యాణ్ ఇలా అందరికీ క్లిన్ కారా ఛామ్ కలిసొస్తోంది.
క్లిన్ కారా అడుగుపెట్టిన వేళా విశేషమో ఏమో కానీ.. ఇంతకుముందు చిరంజీవిని ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. కేంద్రంలోని భాజపా-ఎన్డీయే ప్రభుత్వం .. నటుడిగా, మానవతావాదిగా చిరు అసాధారణ ట్రాక్ రికార్డును, ప్రజా సేవలను గుర్తించి ప్రతిష్ఠాత్మక పురస్కారంతో గౌరవించుకుంది.
చిన్నారి క్లిన్ కారా తమ నట్టింట అడుగుపెట్టగానే రామ్ చరణ్ ఆనందంలో ఎంతగానో పులకించిపోయాడు. అతడు ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో తన అద్భుత నటన, డ్యాన్సులతో ఆకట్టుకోగా, `నాటు నాటు..` పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ పురస్కారం దక్కింది. ఆర్.ఆర్.ఆర్ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారంతో పాటు హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారం దక్కింది. క్లిన్ కారా తమ కుటుంబానికి లక్కీ ఛామ్ గా మారడంతో చరణ్ రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు.
ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అవుతున్నారు. తన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలను జనసేనాని గెలిపించుకున్నారు. ఈ వరుస విజయాలను గమనిస్తే ఇదంతా క్లిన్ కారా వల్ల కలిసొచ్చిన అదృష్టం అని మెగాభిమానులు భావిస్తున్నారు. క్లిన్ కారా ఆ ఇంట అడుగుపెట్టగానే అన్ని విఘ్నాలు తొలగిపోయాయని భావించవచ్చు. అందుకే మెగా కాంపౌండ్ లో రియల్ గేమ్ ఛేంజర్ ఎవరు? అంటే చరణ్ కాదు.. పవన్ కల్యాణ్ కాదు.. క్లిన్ కారా..!