ఖైదీ2 కీలకపాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కూలీ అనే సినిమా చేస్తున్నాడు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కూలీ అనే సినిమా చేస్తున్నాడు. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతున్నట్టు సమాచారం. ఇప్పటికే కూలీ సుమారు 80% షూటింగ్ ను పూర్తి చేసుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజయ్యే అవకాశాలున్నాయి.
సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మిస్తున్న కూలీ బ్యాలెన్స్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కూలీలో రజినీ హీరోగా నటిస్తుండగా నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత లోకేష్ లైన్ లో చాలానే సినిమాలున్నాయి. అందులో లోకేష్ మొదటిగా టేకప్ చేసేది ఖైదీ సీక్వెల్ అని తెలుస్తోంది.
లోకేష్ కెరీర్లో బెస్ట్ సినిమాగా వచ్చిన ఖైదీ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే వెల్లడించిన విషయం తెలిసిందే. 2019లో రిలీజైన ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తో పాటూ బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లను రాబట్టుకుంది. ఖైదీలో కార్తీ హీరోగా నటించాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో లోకేష్ తీసిన మొదటి సినిమా ఖైదీనే.
కూలీ పూర్తి చేసిన తర్వాత లోకేష్ ఖైదీ2ను చేయనున్నాడు. ఇదిలా ఉంటే ఖైదీ2 గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఖైదీ2లో కమల్ హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నాడని, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కమల్ ఖైదీ2లో కనిపిస్తాడని ఇన్ సైడ్ టాక్. ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్ మీడియా వర్గాల్లో తెగ ప్రచారమవుతుంది.
ఖైదీ2 సెట్స్ పైకి వెళ్లాలంటే లోకేష్ ప్రస్తుతం రజినీతో తీస్తున్న కూలీ పూర్తవ్వాలి. మరోవైపు కార్తీ మిత్రన్ దర్శకత్వంలో చేస్తున్న సర్దార్2 కూడా ఫినిష్ చేసుకుని ఫ్రీ అవాలి. ఆల్రెడీ ఖైదీ2 స్క్రిప్ట్ వర్క్ పూర్తైందని సమాచారం. ఇదిలా ఉంటే లోకేష్ బెంజ్ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. బెంజ్ మూవీని కూడా లోకేష్ ఎల్‌సీయూలో చేర్చబోతున్నాడు.