డబ్బింగ్ మూవీలు.. చూసుకోవాలి కదా!

మొత్తానికి ఏ సినిమా టైటిల్ అయినా కంటెంట్ కు పక్కా మ్యాచ్ అవ్వాలి. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాలకు ఇది కచ్చితం.

Update: 2024-04-17 12:21 GMT

భాషతో సంబంధం లేకుండా ఏ ఇండస్ట్రీకి చెందిన మూవీకి అయినా టైటిల్ చాలా ఇంపార్టెంట్. అందుకే మేకర్స్ టైటిల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పర్ఫెక్ట్ టైటిల్ పెట్టేందుకు ట్రై చేస్తుంటారు. ఎందుకంటే టైటిల్.. మూవీపై బజ్ క్రియేట్ అవ్వడంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఆడియన్స్ కూడా మూవీ చూసేకన్నా ముందు టైటిల్ కు అట్రాక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటారు మేకర్స్.

ఇప్పటికే వచ్చిన పలు టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా మూవీలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడంలో టైటిల్స్ దే కీలక భాగం అని చెప్పవచ్చు. ఇటీవల టాలీవుడ్ లోకి డబ్ అయిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అందుకు టైటిల్స్ క్లిక్ అవ్వకపోవడం ఓ కారణమని చెప్పవచ్చు. టైటిల్ కు కంటెంట్ కు ఎలాంటి సంబంధం లేకపోవడం వసూళ్లు తగ్గడానికి కారణమని సినీ ప్రియులు చెబుతున్నారు.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన రోమియో చిత్రాన్ని.. తెలుగులో లవ్ గురు పేరుతో రిలీజ్ చేశారు. కానీ ఈ మూవీ కంటెంట్ కు, టైటిల్ కు ఎలాంటి సంబంధం లేదు. దీంతో ఈ సినిమా.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు. ఇక సౌత్ హీరోయిన్లు రాశీ ఖన్నా, తమన్నా నటిస్తున్న కోలీవుడ్ సినిమా అరణ్మై 4.. తెలుగులో బాక్ టైటిల్ తో రిలీజ్ కానుంది. మూవీ నేమ్ కు హర్రర్ కంటెంట్ తో ఎక్కడా సంబంధం లేదు. దీంతో ఈ సినిమా పేరుపై చర్చ జరుగుతోంది.

తమిళ నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ నటించిన డియర్ మూవీ.. టాలీవుడ్, కోలీవుడ్ లో ఒకే టైటిల్ తో విడుదలైంది. తమిళంలో ఇప్పటికే వచ్చిన గుడ్ నైట్ మూవీ కాన్సెప్ట్‌ నే ఇందులోనూ చూపించారు. ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఈ విషయాన్ని గుర్తించేశారు నెటిజన్లు. కొత్తగా ట్రై చేసి దానికి పేరెంట్స్ ఎమోషన్స్ ను మేకర్స్ యాడ్ చేసినా.. బ్యాడ్ టాక్ సంపాదించుకుందీ మూవీ. ఈ సినిమా టైటిల్ వల్ల కాకపోయినా.. కంటెంట్ వల్ల హిట్ అవ్వలేదు.

ఇక దిగ్గజ దర్శకుడు మణిరత్నం.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ రెండు పార్టులను అన్ని భాషల్లో ఒకే పేరుతో విడుదల చేశారు. ఓకే కన్మణి మూవీకి మాత్రం తెలుగులో ఓకే బంగారం అని పేరు పెట్టారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్.. ఇండియన్-2ను తెలుగులో భారతీయుడు-2 పేరుతో రిలీజ్ చేయనున్నారు.

ఇండియన్-2 మూవీ కంటెంట్ కు టైటిల్ కు సెట్ అవుతుంది. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. మొత్తానికి ఏ సినిమా టైటిల్ అయినా కంటెంట్ కు పక్కా మ్యాచ్ అవ్వాలి. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాలకు ఇది కచ్చితం. మరి రాబోయే రోజుల్లో మేకర్స్ ఇలా ఫార్ములాను పాటిస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News