కొరటాల.. ఆ కాంబినేషన్ రిపీట్ అయ్యుంటే..

టాలీవుడ్ లో చాలా మంది స్టార్ దర్శకులతో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ వర్క్ చేశారు.

Update: 2024-09-11 20:30 GMT

టాలీవుడ్ లో చాలా మంది స్టార్ దర్శకులతో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ వర్క్ చేశారు. మిర్చి నుంచి భరత్ అనే నేను సినిమా వరకు కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్ కలిసి వర్క్ చేశారు. ఈ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి. మూవీ సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా కొరటాల శివ సినిమాలకు కాంటెంట్ కి తగ్గట్లుగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. అందుకే ఆ సినిమాలు అన్ని కూడా మ్యూజికల్ గా హిట్ అయ్యాయి.

అయితే మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఆచార్య సినిమాకి కొరటాల శివ దేవిశ్రీప్రాసాద్ ని పక్కన పెట్టి మణిశర్మని తీసుకున్నారు. ఆ సినిమా రిజల్ట్ ఏంటనేది అందరికి తెలిసిందే. కొరటాల శివ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఆచార్య మూవీ నిలిచింది. ఈ చిత్రం కొరటాల ఇమేజ్ ని కూడా డ్యామేజ్ చేసింది. ఆ డిజాస్టర్ మూడ్ నుంచి బయటకొచ్చిన కొరటాల శివ దేవర సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారు.

సెప్టెంబర్ 27న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్ లో ఐదు భాషలలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. ఇప్పటి వరకు అయితే దేవర నుంచి వచ్చిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ మూడు సాంగ్స్ కూడా కాపీట్యూన్స్ తోనే అనిరుద్ చేసాడనే ట్రోలింగ్ సోషల్ మీడియాలో నడిచింది. ట్యూన్స్ ఎలా ఉన్న సాంగ్స్ ప్రేక్షకులకి బాగా రీచ్ అయ్యాయి.

దేవర మూవీ కమర్షియల్ హిట్ అయితే కొరటాల శివ దేవిశ్రీ ప్రసాద్ తో కాకుండా ఎవరితో మ్యూజిక్ చేయించుకున్న హిట్ కొట్టగలడనే అభిప్రాయం జనాల్లోకి వెళ్తుంది. లేదంటే కొరటాల సినిమాకి కచ్చితంగా దేవిశ్రీ ప్రసాద్ ఉండాల్సిందనే సెంటిమెంట్ బలపడుతుంది. ఇండస్ట్రీలో ఇలాంటి కాంబినేషన్ సెంటిమెంట్స్ ని చాలా మంది బలంగా నమ్ముతారు.

దేవర మూవీతో కొరటాల శివ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఇస్తాడని భావిస్తున్నారు. ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సినిమాపైన అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ అంచనాలని కొరటాల శివ ఏ మాత్రం అందుకుంటాడనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. దేవిశ్రీ ప్రసాద్ కాకుండా అనిరుద్ మ్యూజిక్ తో ఎలాంటి సక్సెస్ ని సొంతం చేసుకుంటాడనేది వేచి చూడాలి.

Tags:    

Similar News