రెబల్ ఫ్యాన్స్ కి మరో మిర్చి.. కానీ..?

ఇదిలా ఉంటే కొరటాల శివ నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో చేస్తాడని ఓ టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ తో సినిమా అంటే అది ఐదేళ్ల తర్వాత అన్నట్టే లెక్క.

Update: 2024-09-22 14:30 GMT

త్వరలో దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొరటాల శివ సినిమా మీద ప్రాణం పెట్టేశాడని తెలుస్తుంది. రైటర్ గా సూపర్ హిట్ సినిమాలకు పనిచేసిన కొరటాల శివ డైరెక్టర్ గా మారిన తర్వాత మిర్చి మొదలు భరత్ అనే నేను వరకు వరుస హిట్లు కొట్టాడు. ఐతే మెగాస్టార్ చిరంజీవి, చరణ్ తో కలిసి చేసిన ఆచార్య మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా ఫ్లాప్ కి రీజన్స్ ఏవైనా సరే కొరటాల శివ మెయిన్ రీజన్ అనుకున్నారు. ఆ తర్వాత కొరటాల శివ ఎవరితో సినిమా చేస్తాడా అని ఎదురుచూడగా ఎన్టీఆర్ తో దేవర ని ఫిక్స్ చేసుకున్నారు.

దేవర సినిమా విషయంలో ప్రతీదీ చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. ఐతే దేవర 1 సెప్టెంబర్ 27న వస్తుండగా ఈ సినిమా సెకండ్ పార్ట్ నెక్స్ట్ ఇయర్ ఉంటుందని తెలుస్తుంది. దేవర తర్వాత తారక్ చేయాల్సిన సినిమాల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. ఐతే కొరటాల శివ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న చర్చ మొదలైంది. ఎన్టీఆర్ దేవర 1 తర్వాత ఏడాది దాకా తారక్ కోసం వెయిట్ చేయక తప్పదు. ఈలోగా మరో సినిమా చేయాలంటే హీరోలు దొరకాలి.

ఇదిలా ఉంటే కొరటాల శివ నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో చేస్తాడని ఓ టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ తో సినిమా అంటే అది ఐదేళ్ల తర్వాత అన్నట్టే లెక్క. ఎందుకంటే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రాజా సాబ్ నుంచి కల్కి 2, స్పిరిట్, హను రాఘవపుడి సినిమా, సలార్ 2 ఇలా అన్ని పూర్తయ్యే సరికి ఎలా లేదన్నా 4, 5 ఏళ్లు అవుతుంది. ఈలోగా కొరటాల శివ తో సినిమా చేసే ఛాన్స్ లేదు. ఐతే ప్రభాస్ కు మిర్చి లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కాబట్టి కొరటాల శివ మంచి కథతో వస్తే ప్రభాస్ కాదనే ప్రసక్తే లేదు.

కానీ ఆయనతో సినిమా అంటే మాత్రం ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేయాలి. ఈలోగా ఎన్టీఆర్ తో దేవర 2 కూడా పూర్తి చేసి మరో హీరోతో కూడా సినిమా చేసే ఛాన్స్ ఉంటుంది. కొరటాల లిస్ట్ లో చరణ్, అల్లు అర్జున్ కూడా ఉన్నారు. ఐతే వారు కూడా వరుస కమిట్మెంట్స్ తో సినిమాలు చేస్తున్నారు. దేవర తర్వాత కొరటాల శివ ఎవరితో చేస్తాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్పొచ్చు.

Tags:    

Similar News