జాన్వీ ట్యాలెంట్ కి షాక్ అయిన టైగర్-శివ!
మరో నాలుగు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. జాన్వీ ఎంతటి ప్రతిభావంతురాలు అన్నది ప్రేక్షకలకు తెలుస్తుంది.
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న `దేవర` సినిమాతో పాన్ ఇండియా సహా తెలుగులో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా? అని కొన్ని సంవత్సరాలు సాగిన చర్చకు `దేవర` ముగింపు పలికింది. మరో నాలుగు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. జాన్వీ ఎంతటి ప్రతిభావంతురాలు అన్నది ప్రేక్షకలకు తెలుస్తుంది.
ఇప్పటికే `దేవర` ప్రచారంలో తెలుగులో మాట్లాడి అదరగొట్టిన సంగతి తెలిసిందే. అమ్మడు తెలుగులో ఎంతో చక్కాగా మాట్లాడింది. లంగావోణీ ధరించి అచ్చమైన తెలుగు పిల్లలా అనిపించింది. ఆ రకంగా తెలుగు ఆడియన్స్ ఇంప్రెషన్ దక్కించుకుంది. మరి జాన్వీ సెట్ లో ఎలా వ్యవరించింది? అంటే డైరెక్టర్ కొరటాల శివ షాకింగ్ అన్సర్ ఇచ్చారు. జాన్వీ ట్యాలెంట్కి అతడు ఫిదా అయినట్లు తెలిపారు.
జాన్వీ చాలా టెలెంటెడ్. రోజూ సెట్కి భయం తో వస్తుంది. తన డైలాగులు ముందే పంపాలని అడుగు తుంది. ఎంతో ప్రాక్టీస్ చేసి సెట్ కి వచ్చేది. మొదటి రోజు సీన్ అవ్వగానే తన టాలెంట్ చూసి నేను, ఎన్టీఆర్ షాక్ అయ్యాం. చాలా నేచురల్ గా నటించేది. అమ్మాయి ఈ సినిమాలో చేయాలని మాకంటే ముందు అనుకుందిట. అదే సమయంలో మేము కూడా తనని ఎంపిక చేసాం.
అందుకు తాను ఎంతో సంతోష పడింది. మన ఇంటి ఆడపిల్లలానే అనిపించింది. ఉత్తరాది అమ్మాయి అని ఎక్కడా అనిపించలేదు` అన్నారు. అలాగే డైరెక్టర్ శంకర్ తాను తీయాలనుకున్న నవల నుంచి కొన్ని సన్నివేశాలు తీసారనే ఓ ఆరోపణ చేసారు. అయితే ఆయన ప్రత్యేకంగా సినిమా..దర్శకుడి పేరు ప్రస్తావించలేదు. ఈ విషయాన్నికొరటాల ముందుకు తీసుకెళ్తే.. కాదు..అసలు దాని గురించే నాకు తెలియదు ` అని అన్నారు.