'దేవర' రెగ్యులర్‌ మూవీ కాదు : కొరటాల

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'దేవర' సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Update: 2024-09-16 06:21 GMT

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'దేవర' సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్ అలీ ఖాన్‌ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అనిరుధ్‌ అందించిన సంగీతం సినిమా పై అంచనాలు పెంచే విధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఫియర్ సాంగ్‌ తో పాటు, రెండు రొమాంటిక్ నెంబర్స్ కచ్చితంగా సినిమా ఓ రేంజ్‌ లో ఉంటుంది అనే నమ్మకంను కలిగిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం ఆచార్య బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

దేవర సినిమాలో ఎన్టీఆర్ ను రెండు విభిన్నమైన పాత్రల్లో చూడబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ట్రైలర్‌ విడుదల తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. యూఎస్ లో ఈ సినిమా ఇప్పటికే రెండు మిలియన్ డాలర్ల డాలర్లను అడ్వాన్స్ బుకింగ్‌ ద్వారా రాబట్టింది. ఒక సౌత్‌ మూవీ విడుదలకు ముందే ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్‌ ద్వారా వసూళ్లు సాధించడం జరగలేదని, దేవర ఆ అరుదైన రికార్డ్‌ ను సొంతం చేసుకుందని అక్కడ సినిమాను పంపిణీ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ సోషల్‌ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. దేవర సినిమా ప్రమోషన్ లో భాగంగా కొరటాల శివ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

దర్శకుడు కొరటాల శివ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సినిమా కథ 1980 - 1990 మధ్య సాగుతుంది. పీరియాడిక్ డ్రామా గా రూపొందిన దేవర సినిమా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని అన్నాడు. అలాగే ఈ సినిమా రెగ్యులర్‌ రొటీన్ యాక్షన్ సినిమాలా ఉండదు. విలన్ అంటూ స్పెషల్ గా ఉండటం, ఫైటింగ్స్ జరగడం ఉండదు. ఒక ఫ్యామిలీలో ఉండే రిలేషన్‌, వారి మధ్య ఉండే విభేదాలను ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఎన్టీఆర్ ను ప్రేక్షకులు ఏ విధంగా అయితే చూడాలి అనుకుంటున్నారో అలాగే దేవర లో కనిపించనున్నట్లు చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్‌ ను చాలా కాలం తర్వాత డబుల్‌ రోల్‌ లో చూడబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరిలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు కొరటాల శివ అద్భుతమైన కథ, కాన్సెప్ట్‌ తో సినిమాను రూపొందించాడు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ అవ్వడం వల్ల నార్త్‌ లో కూడా ఆసక్తి నెలకొంది. ఆమె ఇప్పటి వరకు హిందీలో నటించిన పలు సినిమాల్లో ఏ ఒక్క సినిమా హిట్‌ అవ్వలేదు. కనుక ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆమె కు మొదటి కమర్షియల్‌ హిట్‌ ను ఈ సినిమా అందించే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.

Tags:    

Similar News