సినిమా మధ్యలో వెళ్లిపోతాన్న కృష్ణవంశీ.. మురారి ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీ..!

మురారి సినిమా గురించి అప్పట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మరిన్ని విషయాలు పంచుకున్నారు.

Update: 2024-02-18 14:30 GMT

మహేష్ లీడ్ రోల్ లో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మురారి. 2001 ఫిబ్రవరి 17న రిలీజైన ఈ సినిమా రిలీజై 23 ఏళ్లు పూర్తి చేసుకుంది. మహేష్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఇది ఒకటి. మహేష్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన సినిమా ఇది. ఈ సినిమా కథ కృష్ణవంశీ ఎలా రాసుకున్నారు.. సినిమాలో ఒక పాట విషయంలో సూపర్ స్టార్ కృష్ణ తో కృష్ణవంశీ గొడవ ఏంటి.. అసలు సినిమాలు మురారి అనే పేరు ఎందుకు పెట్టారు ఇలాంటి విషయాల గురించి బ్యాక్ స్టోరీ పై ఓ లుక్కేద్దాం.

మురారి సినిమా గురించి అప్పట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మరిన్ని విషయాలు పంచుకున్నారు. ఈ కథ గురించి చెబుతూ ప్రతి సినిమా లో హీరో విలన్ ఉంటారు. విలన్ ని చంపేందుకు హీరో ప్రయత్నిస్తాడు. మురారి విషయంలో విలన్ మనిషై ఉండకూడదని అనుకుని అది ఒక ఫోర్స్ అవ్వాలని ఈ కథ రాసుకున్నారట. ఆ ఫోర్స్ ని ఎలా జయించారో ఎవరికీ తెలియకూడదు. లాస్ట్ మినిట్ వరకు థ్రిల్ పాయింట్ అయ్యిండాలి. హీరో ఆ గండం నుంచి ఎలా బయటపడతాడా అని ఆడియన్ చివరి వరకు ఉత్కంఠతో చూస్తూ ఉండాలని ఈ కథ రాసుకున్నారట.

ప్రపంచానికి మంచి చేసే ఒక దేవర కోపానికి కారణమైన ఓ వ్యక్తి శాపం నుంచి ఎలా బయటపడ్డాడన్న దాని నుంచే మురారి కథ పుట్టిందని కృష్ణవంశీ చెప్పారు. మైథలాజికల్ కథలోనే మన సంస్కృతి, సంప్రదాయాలను చూపించామని అన్నారు. ఇక కథ అనుకున్నప్పుడే మహేష్ ముగ్ధ మనోహరంగా ఉంటాడు కాబట్టి అతన్ని చూడగానే బృందావనం గుర్తొచ్చింది. అందుకే సినిమాకు మురారి అని టైటిల్ పెట్టామని అన్నారు కృష్ణవంశీ.

మురారి సినిమా కథ కథనాలే కాదు మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్. మణిశర్మ అందించిన మ్యూజిక్ సినిమాకు బలంగా మారింది. ఈ సినిమాలోని అలనాటి రామచంద్రుడి పాట ఎక్కడ పెళ్లి జరిగినా సరే ఆ పాట వినపడుతుంది. ఈ సాంగ్ ని క్లైమాక్స్ ముందు వద్దని అందరు అన్నారట. కృష్ణ గారు కూడా చివర్లో మాస్ సాంగ్ లేకపోవడం కరెక్ట్ కాదు కదా అనవసరంగా ప్రయోగం చేస్తున్నావ్ అన్నారట.

ఆ టైం లో సర్ మన ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఈ సినిమా పాటను నన్ను చేయనీయడం.. లేదా రెండోది ఈ సినిమా ఇక్కడే వదిలేసి వెళ్లిపోవడం. మీరు కమర్షియల్ సాంగ్ చేసి రిలీజ్ చేసుకోండి. నా పేరు కూడా వేయొద్దు అని అన్నారట. తాను చేసే పాట దశాబ్దాల పాటు ఉండిపోతుందని అన్నారట కృష్ణవంశీ. మీ అబ్బాయి కెరీర్ కు కావాలంటే ఆ చండాలాన్ని పెట్టుకోండి నేను వెళ్లిపోతా అన్నారట. చివరకు కృష్ణ గారు ఒప్పుకోవడంతో ఆ పాట పెట్టాం అలా సినిమాలో ఆ పాట సూపర్ హిట్ అయ్యిందని అన్నారు కృష్ణవంశీ.

Tags:    

Similar News