బేబమ్మకి ఊరట.. అక్కడ ఎంత కాలం?

బ్యాక్ టు బ్యాక్‌ టాలీవుడ్‌ లో హిట్‌ లు దక్కించుకోవడం వల్ల ఏకంగా అయిదు సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.

Update: 2024-07-04 17:30 GMT

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. తెలుగు లో ఈ అమ్మడికి మొదటి సినిమాతోనే టాప్‌ హీరోయిన్‌ ఇమేజ్ సొంతం అయ్యింది. బ్యాక్ టు బ్యాక్‌ టాలీవుడ్‌ లో హిట్‌ లు దక్కించుకోవడం వల్ల ఏకంగా అయిదు సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.

ఎంత స్పీడ్‌ గా స్టార్‌ గా ఎదిగిందో అంతే స్పీడ్‌ గా టాలీవుడ్‌ లో డౌన్ ఫాల్‌ అయ్యింది. ఇటీవల కూడా మనమే సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు మరో పరాజయంను మూట కట్టుకున్న విషయం తెల్సిందే. ఒక వైపు టాలీవుడ్‌ లో వరుస ఫ్లాప్స్ వస్తూ ఉంటే కోలీవుడ్‌ లో మాత్రం వరుస ఆఫర్లు దక్కుతున్నాయి.

కోలీవుడ్‌ లో ఈమధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలకు ఈ అమ్మడు సైన్ చేసింది. మలయాళ స్టార్‌ హీరో దుల్కర్ సల్మాన్‌ కి జోడీగా కూడా ఈ అమ్మడు ఒక సినిమాను చేయబోతుంది. జయం రవితో ఇప్పటికే ఒక సినిమాను చేస్తుంది.

లవ్‌ టుడే ఫేమ్‌ ప్రదీప్‌ రంగనాథన్ తో కలిసి కూడా ఈ అమ్మడు ఒక సినిమాను చేస్తుంది. తమిళ స్టార్‌ హీరో కార్తి తో కూడా ఈ అమ్మడు ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. టాలీవుడ్‌ లో ఒక్క సినిమా కూడా ఈ అమ్మడి చేతిలో లేవు.

టాలీవుడ్‌ ఆఫర్లు దక్కించుకోకున్నా కూడా కోలీవుడ్‌ లో బిజీగా ఉండటం వల్ల బేబమ్మ కి పెద్ద ఊరట అని చెప్పాలి. టాలీవుడ్‌ లో మాదిరిగా అక్కడ కొంత కాలమే బిజీగా ఉంటుందా.. లేదంటే తమిళ ప్రేక్షకులకు ఈ అమ్మడు నచ్చేసి మరిన్ని పెద్ద సినిమాల్లో నటించనుందో చూడాలి.

Tags:    

Similar News

eac