బులుగు బ్యూటీ లో కృతి నాటీగా!
ముంబై బ్యూటీ కృతిశెట్టి కొత్త ఏడాదిలో మళ్లీ పుంజుకునేలా కనిపిస్తోంది
ముంబై బ్యూటీ కృతిశెట్టి కొత్త ఏడాదిలో మళ్లీ పుంజుకునేలా కనిపిస్తోంది. అమ్మడి సినిమా లైనప్ బాగానే కనిపిస్తుంది. కోలీవుడ్ లో మూడు సినిమాలు..టాలీవుడ్ లో సినిమా ఛాన్స్ చేతిలో ఉంది. వీటితో పాటు మాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తుంది. మొత్తంగా నాలుగైదు ఛాన్సులైతే రెడీగా ఉన్నాయి. అవి ఆన్ సెట్స్ లోనే ఉన్నాయి. గత ఏడాది కేవలం 'కస్టడీ'తోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అది ప్లాప్ అయింది.
ఆ సినిమా ఒక్కటే ఉండటంతో కృతి పేరు పెద్దగా వినిపించలేదు. కానీ తాజాగా అమ్మడి లైనప్ తో నెమ్మదిగా మీడియా అటెన్షన్ డ్రా చేస్తున్నట్లే కనిపిస్తోంది. కొత్త అవకాశాలతో కొత్త ఏడాదిలో కొంగొత్తగా పలకరిస్తాను అంటోంది. ఇక బ్యూటీలో నాటీ యాంగిల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇన్ స్టాలో అమ్మడు ఎప్పటికప్పడు కొత్త ఫోటోలతో కుర్రాళ్ల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది.
ఛాన్సులు చేతిలో ఉన్నా ! లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఉంటానంటూ గ్యాప్ ని బ్యాలెన్స్ చేస్తుంటుంది. తాజాగా అమ్మడు మరో హాట్ ఫోటోతో నెట్టింట్లోకి వచ్చేసింది. బులుగు అందంలో బ్యూటీ బంతాట ఆడేస్తోంది. ఇదిగో ఇక్కడిలా టోటల్ బ్లూ డ్రెస్...బ్లూ లైట్.. బ్లూ బ్లాక్ డ్రాప్ లో అంతా బులుగు మయం చేసేసింది. చిక్ స్లివ్ లెస్ షిమ్మరీ క్రాప్ టాప్ దుస్తులపై మ్యాచింగ్ ఫార్మల్ ప్యాంటు మరియి హీల్స్ ధరించింది.
అమ్మడి పోని టెయిల్ హెయిర్ స్టైల్ మరింత స్లైలింగ్ గా తీర్చిదిద్దింది. రింగులు లాంటి చెవి పొగులు మరింత బ్యూటీని తీసుకొచ్చాయి. ఇక కృతి కిల్లర్ లుక్ అన్నింటికంటే హైలైట్. క్లోజప్ షాట్ లో అమ్మడి కను గుడ్లు సైతం బులురు రంగుని పక్కాగా మ్యాచ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కృతి అభిమానులు తనివి తీరా చూసి ఆస్వాదిస్తున్నారు.