బేబమ్మ ఫస్ట్‌ జాబ్‌, ఫస్ట్‌ శాలరీ

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్ తో కలిసి ఉప్పెన సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి

Update: 2023-11-10 02:00 GMT

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్ తో కలిసి ఉప్పెన సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. మొదటి సినిమా తోనే సంచలనం సృష్టించిన ఈ అమ్మడు వరుసగా మూడు నాలుగు విజయాలు దక్కడంతో టాలీవుడ్‌ లో టాప్ హీరోయిన్‌ ల రేంజ్ లో పారితోషికం దక్కించుకుంది. అంతలోనే సీన్ రివర్స్ అయింది.

ఎంత స్పీడ్‌ గా కెరీర్‌ లో దూసుకు పోయిందో అంతే స్పీడ్ గా కృతి శెట్టి డౌన్ ఫాల్‌ స్టార్ట్‌ అయింది. ఏడాది తిరిగే లోపు కృతి శెట్టి ఖాతాలో సినిమాలే లేకుండా అయ్యాయి. అప్పుడు కోట్లు ఆఫర్‌ చేసి తమ సినిమాల్లో నటించాలని కోరిన వారు ఇప్పుడు ఆమె తో సినిమాకు ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడు ఆమె పారితోషికం సగానికి తగ్గించినా కూడా ఆఫర్లు రావడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ విషయాలను పక్కన పెడితే తాజాగా కృతి శెట్టి ఒక ఇంటర్వ్యూలో తన మొదటి జాబ్ మరియు మొదటి పారితోషికం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను చిన్నతనంలో పాకెట్‌ మనీ కోసం కూడా ఏదో ఒక పని చేయాల్సి వచ్చేదని చెప్పుకొచ్చింది. తన ఇంట్లో చాలా పద్దతలు ఉంటాయి, అందులో ఒకటి పని చేస్తేనే పాకెట్‌ మనీ ఇచ్చేవారు అంది.

మా అమ్మ నుంచి పాకెట్‌ మనీ కోసం డబ్బు లు తీసుకోవాలంటే ఆమె చెప్పే పని తప్పనిసరిగా చేయాల్సి ఉండేది. అమ్మ చెప్పిన పనులు చేయడం నా ఫస్ట్ జాబ్‌. అమ్మ ఇచ్చిన రూ.100, రూ.150 లు నాకు మొదటి శాలరీ అంటూ కృతి శెట్టి చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News