చరణ్‌ అంటే ఎందుకు ఇష్టం...!

తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసిన ఈ అమ్మడు ఈ మధ్య కాస్త స్లో అయిన విషయం తెల్సిందే.

Update: 2024-06-03 12:30 GMT

ఉప్పెన సినిమా తో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈ అమ్మడు తెలుగు లో ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేసింది. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసిన ఈ అమ్మడు ఈ మధ్య కాస్త స్లో అయిన విషయం తెల్సిందే.

తాజాగా ఈమె యంగ్‌ హీరో శర్వానంద్‌ తో కలిసి మనమే అనే విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ వారంలో విడుదల అవ్వబోతున్న మనమే సినిమా ప్రమోషన్‌ కోసం కృతి శెట్టి మీడియా ముందుకు వచ్చింది.

ఆ సమయంలో సినిమా గురించి పలు విషయాలను చెప్పుకొచ్చిన కృతి శెట్టి తన వ్యక్తిగత విషయాలను గురించి కూడా మాట్లాడటం జరిగింది. గతంలో పలు సార్లు రామ్‌ చరణ్ అంటే నాకు విపరీతమైన అభిమానం అంటూ చెప్పుకొచ్చిన కృతి శెట్టి మరోసారి అదే విషయాన్ని చెప్పుకొచ్చింది.

చరణ్‌ అంటే తనకు ఎందుకు అభిమానం అనే విషయమై స్పందిస్తూ... రామ్‌ చరణ్ గొప్ప పెర్ఫార్మర్‌. నేను ఉప్పెన సినిమాలో చేస్తున్న సమయంలో రంగస్థలం సినిమా ను చూశాను. ఆ సినిమాలో చరణ్ గారి నటన చూసి షాక్‌ అయ్యాను. ఆయన గొప్ప నటుడు అనే అభిప్రాయం ఏర్పడింది.

ఆయన డెడికేషన్ గురించి నేను చాలా సార్లు విన్నాను. నిజ జీవితంలో కూడా గొప్ప వ్యక్తిగా, మంచి మనిషిగా, మంచి స్నేహితుడిగా రామ్‌ చరణ్ గురించి విన్నాను. అందుకే ఆయన అంటే నాకు అమితమైన అభిమానం అని, ఆయనతో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అంది.

నా జీవితంలో రామ్‌ చరణ్ గారితో నటించడం అనేది అద్భుత క్షణం. అలాంటి ఒక సమయం నా జీవితం వస్తుందని నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అన్నట్లుగా మరో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మరి కృతికి చరణ్ నుంచి పిలుపు వచ్చేనా అనేది చూడాలి.

Tags:    

Similar News