పిక్‌ టాక్‌ : బ్లాక్‌ డ్రెస్‌లో కృతి మెస్మరైజింగ్‌

హిందీలో ఈమె చేసిన సినిమాలు కమర్షియల్‌గా విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా నటిగా ఈమెకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి.

Update: 2025-01-01 12:04 GMT

సరిగ్గా పదేళ్ల క్రితం మహేష్ బాబు, సుకుమార్‌ కాంబోలో వచ్చిన '1 నేనొక్కడినే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి సనన్‌. తెలుగులో మొదటి సినిమా నిరాశపరచడంతో పెద్దగా ఆఫర్లు సొంతం చేసుకోలేక పోయింది. ఆ తర్వాత చేసిన సినిమా సైతం బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరిచాయి. అయితే లక్కీగా ఈ అమ్మడికి బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ సినిమాలు పడ్డాయి. హిందీలో ఈమె చేసిన సినిమాలు కమర్షియల్‌గా విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా నటిగా ఈమెకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. అందుకే బాలీవుడ్‌లో గత పదేళ్లుగా వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకు పోతుంది.


తెలుగు లో చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్‌కి జోడీగా ఆదిపురుష్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిపురుష్ సినిమా హిందీలో రూపొందినా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఆ సినిమాతో మరోసారి కృతి సనన్‌ వచ్చింది. సీత పాత్రలో ఆమె నటించడం ద్వారా ఆమె పై చాలా మంది మరింత గౌరవంను అభిమానంను పెంచుకున్నారు. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హాలీవుడ్‌ స్టార్స్‌కి ఏమాత్రం తగ్గకుండా సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ను కలిగి ఉన్న ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలోనూ అదే కొనసాగిస్తూ దూసుకు పోతుంది. మరో వైపు ఈ అమ్మడు ఆకట్టుకునే అందంతో ఫోటోలను షేర్‌ చేస్తూ వస్తుంది.

తాజాగా మరోసారి సోషల్‌ మీడియాలో కృతి సనన్‌ అందమైన ఫోటో వైరల్‌ అవుతోంది. ఒక పార్టీలో సన్‌ సెట్‌ సమయంలో తీసుకున్న ఈ ఫోటోలో కృతి మెరిసి పోతుంది. బ్లాక్‌ డ్రెస్‌లో కృతి సనన్‌ కనీసం చూపు తిప్పనివ్వడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, నిజంగా కృతి మెస్మరైజింగ్‌ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందమైన సూర్యాస్తమయం సమయంలోనూ ఈ అమ్మడు అంత కంటే ఎక్కువ అందంగా కనిపించడం ఈమెకే చెల్లింది. విభిన్నమైన మేకోవర్‌తో కృతి గతంతో పోల్చితే మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

2024లో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతిసనన్‌ కొత్తగా ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఏమీ లేవు. కానీ కచ్చితంగా ఈ ఏడాదిలోనూ ఆమె నుంచి మూడు నాలుగు సినిమాలు వస్తాయంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్న సినిమాలను వెంటనే మొదలు పెట్టి ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుందా అనేది చూడాలి. బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌లను తన కెరీర్‌లో దక్కించుకున్న ఈ అమ్మడు 2025లో అంతకు మించిన భారీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలను, మంచి కమర్షియల్‌ హిట్స్‌ను దక్కించుకుంటుందేమో చూడాలి.

Tags:    

Similar News