స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చి చెల్లిపై ప్రేమ‌ను చాటుకున్న‌ అక్క‌!

బాలీవుడ్ సిస్ట‌ర్స్ కృతిస‌న‌న్-నుపూర్ స‌న‌న్ గురించి ప‌రిచయం అవ‌స‌రం లేదు. అక్కా-చెల్లి ఇద్దరూ ఇండ‌స్ట్రీలో దూసుకుపోతున్నారు.

Update: 2024-10-24 19:30 GMT

బాలీవుడ్ సిస్ట‌ర్స్ కృతిస‌న‌న్-నుపూర్ స‌న‌న్ గురించి ప‌రిచయం అవ‌స‌రం లేదు. అక్కా-చెల్లి ఇద్దరూ ఇండ‌స్ట్రీలో దూసుకుపోతున్నారు. న‌టిగా చెల్లి కంటే అక్క కృతిస‌న‌న్ సీనియ‌ర్. జాతీయ ఉత్త‌మ న‌టిగా అవార్డు సైతం అందుకుని షెభాష్ అనిపించుకుంది. న‌టిగానూ మెరుగైన అవ‌కాశాలు అందుకుంటుంది. ఎంతో మంది సీనియ‌ర్ న‌టీమ‌ణుల్ని స్పూర్తిగా తీసుకుని ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కృతిస‌న‌న్ ఇప్పుడు న‌వతరానికి తాను స్పూర్తిగా నిలిచింది.

అయితే త‌మ బంధువులంతా అక్కా-చెల్లిని వేరుగా చేస్తున్నార‌ని ఆవేద‌న చెందింది. `నుపుర్ -నేను ఎంతో స‌ర‌దాగా ఉంటాం. అన్ని విష‌యాలు షేర్ చేసుకుంటాం. నాకంటే జూనియ‌ర్. విభ‌న్న పాత్ర‌లు ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. న‌టిగా మ‌రింత గుర్తింపు తెచ్చుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. మేము ఇద్ద‌రం ఒకే రంగంలో ఉండ‌టం వ‌ల్ల మా బంధువులు మాత్రం మ‌మ్మ‌ల్ని పోల్చి చూస్తున్నారు. నాతో ఒక‌ర‌కంగా..నుపుర్ తో మ‌రో ర‌కంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

వారి ప్ర‌వ‌వ‌ర్తన చూసి నాకు చాలాసార్లు కోపం వ‌చ్చింది. మా ఇద్ద‌రిని పోల్చి చూడాల్సిన అవ‌స‌రం ఏముంది? త‌ను ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఎన్నో రోజులు కాలేదు. నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌ప్పుడు త‌ను చాలా చిన్న‌ది. నేను వ‌చ్చి దాదాపు ప‌దేళ్లు అవుతుంది. అలాంట‌ప్పుడు ఒకరు ఎక్కువ‌? మ‌రొక‌రు త‌క్కువ‌? అని ఎలా పోల్చుతారు. ఇది చాలా త‌ప్పు. ఇలా పోల్చినంత మాత్రాన ఎవ‌రూ త‌క్కువ కాదు. మేము ఎప్పుడూ స‌మాన‌మే.

మ‌నం చూసే విధానాన్ని బ‌ట్టి మ‌నుషులు ఎలాంటి వారు అన్న‌ది అర్దం చేసుకోవ‌చ్చు` అని బంధువుల‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది. ఈ అమ్మ‌డు న‌టించిన దో ప‌త్తి ఈనెల 25న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగానే ఈ వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌స్తుతం ఆ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Tags:    

Similar News