ఆ ట్యాగ్ నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోయాను.. న‌టి ఆవేద‌న‌

కాలంతో పాటే అనుభవాల‌తో రాటు దేలాక చివరకు నటిగా డెప్త్ ఉన్న‌ మంచి అవకాశాలను ఎంచుకునే అవ‌కాశం ద‌క్కుతోంది.

Update: 2024-10-23 03:00 GMT

1-నేనొక్క‌డినే సినిమాతో న‌టిగా కెరీర్ ప్రారంభించింది కృతి స‌నోన్. ఈ అమ్మ‌డి ఠిపిక‌ల్ పెర్ఫామెన్స్‌, స్టైల్, గ‌ట్సీ లుక్స్ మొద‌టి సినిమాతోనే ప్ర‌జ‌లకు క‌నెక్ట‌య్యాయి. కానీ మొద‌టి సినిమా ప‌రాజ‌యం పాలై నిరాశ‌ప‌రిచింది. అనంత‌రం విజయాల‌తో కృతి త‌న‌ని తాను నిరూపించుకుని త‌న‌కంటూ ఒక స్టార్ డ‌మ్ అందుకునేందుకు చాలా స‌మ‌యం ప‌ట్టింది. కృతి సనన్ తన సుదీర్ఘ‌ ప్రయాణంలో కొన్ని విజ‌యాలు సాధించినా చాలా కాలం పాటు వేచి చూడాల్సి వ‌చ్చింది. కాలంతో పాటే అనుభవాల‌తో రాటు దేలాక చివరకు నటిగా డెప్త్ ఉన్న‌ మంచి అవకాశాలను ఎంచుకునే అవ‌కాశం ద‌క్కుతోంది. `మిమీ` చిత్రంలో న‌ట‌న‌కు జాతీయ ఉత్త‌మ న‌టిగా అవార్డును అందుకుంది. ఆ తర్వాత ఎంపిక‌ల విష‌యంలో ప్ర‌ణాళికా బ‌ద్ధంగా ముందుకు సాగుతోంది. ఇప్పుడు నిర్మాత‌గా మారి దోపిట్టి అనే సినిమాని నిర్మించింది. తాజా ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో కృతి చాలా సంగతులు ముచ్చ‌టించింది.

హీరో పంతి చిత్రంతో నటిగా హిందీ పరిశ్రమలో అడుగుపెట్టి, అటుపై దాదాపు దశాబ్దం పాటు జ‌ర్నీ సాగించాక కృతి సనన్ చివ‌రికి ఇప్ప‌టికి సినీ నిర్మాతగాను మారింది. కనికా ధిల్లాన్‌తో కలిసి ఈ బ్యూటీ నిర్మించిన తొలి చిత్రం `దో పట్టి` OTTలో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజా చాటింగ్ సెష‌న్‌లో కృతి త‌న కెరీర్ ప్రయాణం గురించి మాట్లాడింది. కృతి ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం కూడా చేసింది. అందువల్ల దీనిని త‌న కెరీర్ లోనే అత్యంత ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ గా అభివ‌ర్ణించింది. పరిశ్రమలో మెల్లగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించిన ఔట్‌సైడ‌ర్ గా కృతికి గుర్తింపు ద‌క్కింది. ఇప్ప‌టికి న‌టిగా ఎదిగి, చివ‌రికి సినిమా నిర్మాత‌గా మార‌డం సంతోషంగా ఉందా? అని ప్ర‌శ్నించ‌గా, ఇక్క‌డ ఏది వ‌ర్క‌వుటైతే దానిలో మెరుగ‌వ్వాల‌ని అర్థం చేసుకున్నాను.. సమయం, విజయం.. అనుభవంతో నెమ్మదిగా మరిన్ని అవకాశాలు లభిస్తాయి. ఒక నటిగా మరింతగా అన్వేషించాలి. నేను ఎదగడానికి అభివృద్ధి చెందడానికి స్పృహతో కూడిన ప్రయత్నం చేశాను అని కృతి చెప్పింది.

దో పట్టితో తనకంటూ ఒక అవకాశాన్ని ఎలా సృష్టించుకోవాలనుకుంటుందో కూడా చెప్పింది. కృతి మాట్లాడుతూ-``నేను నిర్మాతగా మాత్రమే కాకుండా నటిగా కూడా ఈ అవకాశాన్ని దాదాపుగా సృష్టించుకున్నాను. నేను మిమీ త‌ర్వాత ఈ ప్ర‌య‌త్నం చేసాను. ఇంకేదైనా లోతైనదాన్ని కనుగొనాలనుకున్నాను. కొన్నాళ్లుగా అలాంటిది కనుగొనలేకపోయాను. నేను చేసిన కొన్ని స్క్రిప్ట్‌లు నాకు నచ్చాయి. అది తేరీ బ‌త‌న్ మే... లేదా క్రూ అని చెప్పవచ్చు. ర‌చ‌యిత‌ క‌నికా నేను కూడా మంచి కథలకు మద్దతు ఇవ్వాలని, సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం.. అని తెలిపింది.

టైగర్ ష్రాఫ్ హీరోయిన్ ట్యాగ్ నుండి బయటపడేందుకు తనకు చాలా స‌మ‌యం ప‌ట్టింద‌ని, చివ‌రికి `బరేలీ కి బర్ఫీ`తో దానిని అధిగ‌మించాన‌ని కృతి సనన్ చెప్పింది. పిల్లలు నన్ను `టైగర్ దీదీ` అని పిలిచేవారని గుర్తు చేసుకుంది. మ‌నం సెట్‌లో ఉండటానికి ఉత్సాహం నింపడానికి ఛాలెంజింగ్ పాత్రల్లో నటించడం అవసరం. ఎటువంటి ఛాలెంజ్ లేని సినిమాలు చేసాను. అది నిద్రపోయేలా అనిపించింది. కానీ `ఓహ్ ఈరోజు నేను వెళ్లి ఈ సన్నివేశం చేయడానికి సంతోషిస్తున్నాను` అని నన్ను సవాలు చేయనప్పుడు అది సెట్‌లో నన్ను ఉత్తేజపరచలేదు. అప్పుడు సంతృప్తి కూడా లేదు. ఇప్పుడు ఒక దశాబ్దం తర్వాత, నేను కొన్ని చిత్రాలను ఎంచుకోగలిగే స్థాయికి చేరుకున్నాను అని చెప్పింది.

Tags:    

Similar News