హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన కృతిసనన్!
మేల్ డామినేషన్ ఇండస్ట్రీ అంటూ బాలీవుడ్ పై ఇప్పటికే చాలా మంది భామలు తమ అసహనాన్ని వ్యక్తం చేసారు
మేల్ డామినేషన్ ఇండస్ట్రీ అంటూ బాలీవుడ్ పై ఇప్పటికే చాలా మంది భామలు తమ అసహనాన్ని వ్యక్తం చేసారు. హీరోతో సమాన పారితోషికానికి తామెందుకు అనర్హులం అంటూ గొంతెత్తిన సందర్భాలెన్నో ఉన్నాయి. మేల్ డామినేషన్ ఇండస్ట్రీలో ఫీమేల్ కి సరైన స్థానం లేదా? అంటూ ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉంటుంది. కంగనా రనౌత్...ప్రియాంక చోప్రా... దీపికా పదుకొణే..కరీనా కపూర్ లాంటి సీనియర్ భామలెంతో మంది అసహనాన్ని వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. తాజాగా 'ది క్రూ' సినిమాని అడ్డుపెట్టుకుని జాతీయ ఉత్తమ నటి కృతిసనన్ నిప్పులు చెరిగే ప్రయత్నం చేసింది.
కథానాయకులు ఎవరూ లేకపోయినా 'ది క్రూ' బాగా ఆడుతుంది. మంచి వసూళ్లు సాధిస్తుంది. ఇందులో మెయిన్ లీడ్స్ చేసిన వారు ముగ్గురు మహిళలే. సినిమా ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సినిమాలో కేవలం పెద్ద హీరోలు ఉన్నంత మాత్రాన ప్రేక్షకులు థియేటర్ కి పరిగెత్తుకుని రారు. కథ బాగుంటే అందులో ప్రధాన పాత్రధారులు ఆడా? మగా అనే తారతమ్యం చూడరు. కానీ దురదృష్టవశాత్తు కొందరు దర్శక-నిర్మాతల్లో సైతం మహిళా ప్రాధాన్య సినిమాలకు ప్రేక్షకులు రారు.
తాము చెల్లించిన టికెట్ కి సరైన న్యాయం జరగదని ప్రేక్షకులు భావిస్తారు. ఇక్కడ ప్రేక్షకులు కూడా మారాలి. బాక్సాఫీస్ నెంబర్లతో లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు ఎలాంటి ఫలితాలు సాధించాయి అన్నది ఆలోచించాలి. మాలాంటి వారి సినిమాలు కూడా అద్భుతాలు సృష్టిస్తాయని గమనించాలి' అని పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఎలాంటి జంకు బెంకు లేకుండా అమ్మడు బాలీవుడ్ హీరోలపై సెటైర్లు వేసిందంటూ నెట్టింట ప్రచారం ఊపందుకుంది.
మరికొంత మంది బాలీవుడ్ లో ఉన్నదే కృతిసనన్ ఓపెన్ గా చెప్పిందని...జరుగుతోన్న వాస్తవం అదేనంటూ ఆమెకి మద్దతుగానూ నిలుస్తున్నారు. మొత్తానికి కృతిలో కూడా తిరుగుబాటు ధోరణి మొదలైందని తెలుస్తోంది. ఈ అమ్మడు తెలుగులో కూడా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. మహేష హీరోగా నటించిన వన్ నేనొక్కడినే చిత్రంతో ముందుగా టాలీవుడ్ లో నే లాంచ్ అయింది. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో నటించింది. కానీ ఇక్కడ నిలదొక్కుకోవడంలో విఫలమైంది.