సవాళ్లు..విలన్లే ఇష్టం..కానీ నేనేమో అలా!
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కెళ్లి సక్సెస్ అయిన కృతి సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కెళ్లి సక్సెస్ అయిన కృతి సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. `వన్` తో తెలుగులో లాంచ్ అయిన అమ్మడు అటుపై రెండు, మూడు సినిమాలు చేసి ముంబైకె ళ్లిపోయింది. అక్కడ మాత్రం బాగానే కలిసొచ్చింది. వరుస విజయాలతో వేగంగా స్టార్ లీగ్ లో చేరింది. అటుపై జాతీయ ఉత్తమ నటిగానూ అవార్డు..రివార్డు అందుకుంది. దీంతో అమ్మడి రేంజ్ అంతకంతకు రెట్టింపు అయింది. లేడీ ఓరియేంటెడ్ చిత్రాలకు సైతం ప్రమోట్ అయింది.
ఈ నేపథ్యంలో కృతి సనన్ మనసులో దాచేసిన ఎన్నో ఎమోషన్స్ ని సైతం బయట పెట్టే ప్రయత్నం చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీ తీరుపై తీవ్ర అసహనాన్ని సైతం వ్యక్తం చేసింది. అవకాశాల పట్ల హీరోయిన్లు ఎంతగా ఇబ్బంది పడతారు? అనే అంశాన్ని లేవనెత్తింది. మేల్ డామినేషన్ ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయన్నది చెప్పే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా తన కెరీర్ సంబంధించి ఇన్నాళ్లు మనసులో దాచుకున్న భావోద్వేగాన్ని సైతం బయట పెట్టింది.
అమ్మడికి హీరోయిన్ పాత్రలు పోషించడం పెద్దగా ఇష్టం ఉండదుట. ఆ పాత్రలో ఏమంత కిక్ ఉండదం టోంది. ఆ పాత్రకంటే విలన్ పాత్రలు, చాలెంజింగ్ రోల్స్ పోషిస్తే బాగుంటుందని, తన మొదటి ఛాయిస్ వేటికి అంటే ఛాలెంజింగ్ రోల్స్ వైపు ఓటు వేసింది. సాఫీగా సాగిపోయే పాత్రలు, ఆడిపాడి పాత్రలు చేస్తే ఎప్పటికీ నటిగా ఎదగలేము అంటోంది. నటిగా ప్రత్యేక గుర్తింపు దక్కాలంటే ఎంపిక చేసుకునే పాత్రలు సైతం అంతే కఠినంగా ఉండాలంటోంది.
అలాగే `దో పత్తి` అనే సినిమాతో కృతి సనన్ నిర్మాత కూడా ప్రయాణం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఓ నిర్మాతగా తన ప్రమే యం ప్రతీ అంశంలోనూ ఉంటుందిట. ఇప్పటికే కొన్ని విషయాలు తెలుసు కున్నానని, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయంది. ఇలా నిర్మాతగా మారడానికి ఓ ప్రత్యేక కారణాన్ని చెప్పుకొచ్చింది. `సొంత సినిమా కాబట్టి అన్ని విషయాల్లో కల్పించుకోవచ్చు. ఎవరు అడ్డు చెప్పరు. నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని` తెలిపింది.