ప్ర‌భాస్ వ‌ర్సెస్ బ‌న్నీ.. KRK ఇదేం పోలిక‌?

మ‌న స్టార్లు పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగేస్తున్నారు. జాతీయ స్థాయిలో గొప్ప అభిమానం గౌర‌వం అందుకుంటున్నారు.

Update: 2024-04-15 03:45 GMT

మ‌న స్టార్లు పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగేస్తున్నారు. జాతీయ స్థాయిలో గొప్ప అభిమానం గౌర‌వం అందుకుంటున్నారు. ఇది కొంద‌రికి స‌హించ‌డం లేదు. ఇందులో వివాదాస్ప‌ద క్రిటిక్ కేఆర్కే కూడా ఒకడు. అత‌డు ఇంత‌కుముందు ప్ర‌భాస్ సినిమాల‌పై నెగెటివ్ స‌మీక్ష‌ల‌ని స్ప్రెడ్ చేసాడు. ఇప్పుడు

అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ వ్య‌వ‌హారంపై KRK వివాదాస్పద వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ని నిశితంగా గ‌మ‌నించిన కేఆర్కే ఇప్పుడు ఈ వివాదంలో త‌ల‌దూర్చాడు.

ఇద్దరు స్టార్ల ఎమోష‌న‌ల్ ఫ్యాన్ అసోసియేష‌న్స్ ఆన్‌లైన్ చర్చలలో చురుకుగా పాల్గొంటుండ‌గా, ఎవ‌రికి వారు త‌మ ఫేవ‌రెట్ ని ఆరాధిస్తూ ఇత‌రుల‌ను నిందిస్తున్నారు. ఈ ఆన్‌లైన్ వాద‌న‌లు స్టార్ల అపారమైన ప్రజాదరణను ప్రతిబింబిస్తూ పోటీకి మరో కొత్త కోణాన్ని జోడిస్తున్నాయి. కానీ అగ్నికి ఆజ్యం పోస్తూ, బాలీవుడ్ విమర్శకుడు KRK ప్రభాస్- అల్లు అర్జున్‌లను పోల్చుతూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. భౌతిక లక్షణాలు, పాన్-ఇండియా అప్పీల్ ఆధారంగా ప్రభాస్‌కు అనుకూలంగా ఆయన చేసిన ప్రకటన మరింత చర్చకు దారితీసింది. అభిమానుల మధ్య అభిప్రాయ విభ‌జ‌న‌కు దారి తీసింది.

కేవలం బాక్సాఫీస్ గణాంకాలు లేదా భౌతిక లక్షణాల ఆధారంగా నటీనటులను పోల్చడం స‌రైన పంథా కానే కాద‌. ఇది పరిమిత ఆలోచ‌న‌లు, దృక్పథాన్ని ప్రదర్శిస్తుందని గమనించడం ముఖ్యం. ప్రభాస్ -అల్లు అర్జున్ ఎవ‌రికి వారే తోపు. ఇద్దరూ ప్రత్యేకమైన బలాలు, బ‌ల‌గాల‌ను కలిగి ఉన్నారు. స్వీయ‌ విజయానికి ఎవ‌రికి వారు సొంతంగా మార్గం వేసుకున్నారు. పరిశ్రమకు వారి వ్యక్తిగత సహకారం.. చేసి ప‌నిలో వారి అంకితభావం ప్రశంసార్హ‌మైనది.

ఆ ఇద్ద‌రినీ పోల్చుతూ ఫలానా హీరో `నంబర్ వన్` అని పేర్కొన‌డం స‌రికాదు. ఇలాంటి వ్యాఖ్య‌ల‌తో కేఆర్కే ఇప్పుడు చ‌ర్చ‌ల్లో కొచ్చాడు. నిజానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పోటీ ఆరోగ్య‌క‌ర‌మైన‌ది. హీరోలు ఒక‌రితో ఒక‌రు పోటీప‌డినా కానీ, ఎంతో స్నేహంగా ఉంటారు. పోటీని ఆరోగ్య‌కరంగా భావించి ముందుకు సాగుతారు. ప్రభాస్ - అల్లు అర్జున్ ఇద్దరూ తమ అసాధారణమైన నటప్ర‌తిభ‌తో తెరపై ఆకర్షణీయమైన ప్రదర్శనతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ద‌శాబ్ధం పైగానే కెరీర్ కోసం పోరాటం సాగించి విజేత‌లుగా నిలిచారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ప్రముఖ హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. చిరంజీవి తిరుగులేని నంబర్ వన్ హీరోగా సుదీర్ఘ పాలనను ఆస్వాధించ‌గా, ప్రస్తుత తరం తీవ్ర‌మైన పోటీని ఎదుర్కొంటోంది. ప్రభాస్ -అల్లు అర్జున్ లు బలమైన పోటీదారులుగా ఉద్భవించారు. వీరితో పాటు రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్ వంటి స్టార్లు పోటీబ‌రిలో ఉన్నారు. పాన్ ఇండియా రేసులో వీరంతా ఒక్కొక్క‌రుగా దూసుకెళుతున్నారు. కానీ వారి మ‌ధ్య పోటీ ఎంతో ఆహ్లాద‌క‌ర‌మైన‌ది.

ఈ చర్చకు ఆజ్యం పోసిన కారణాన్ని ప‌రిశీలిస్తే... బాహుబలి సిరీస్ తర్వాత, ప్రభాస్ పాపులారిటీ విపరీతంగా పెరిగి, అతన్ని పాన్-ఇండియా స్టార్‌గా స్థిరపరిచింది. బాహుబ‌లి ఫ్రాంఛైజీ త‌ర్వాత పెద్ద ఫ్లాపులు ఎదురైనా కానీ, అత‌డి స్టామినా ఫాలోయింగ్ దృష్ట్యా భారీ ఓపెనింగుల‌తో అద‌ర‌గొడుతున్నాడు. ప్ర‌భాస్ త‌న ప్రతి సినిమాతో భారీ ఓపెనింగ్‌లను సృష్టించి సునాయాసంగా 100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశిస్తున్నాడు. దీంతో అత‌డిని కేఆర్కే నంబ‌ర్ వ‌న్ సౌత్ స్టార్ గా భావిస్తున్నారు.

అల్లు అర్జున్ కెరీర్ స్థిరంగా ఎదుగుతోంది. అత‌డు ప్రయోగాలతో ఆక‌ర్షిస్తున్నాడు. బ‌న్ని న‌ట‌న‌, డ్యాన్సుల్లో నైపుణ్యం, స్టైలిష్ వ్యక్తిత్వం అత‌డిని పైపైకి చేరుస్తున్నాయి. చేసే ప‌నిలో అతడి అంకితభావం అతనికి నమ్మకమైన ఫాలోయింగ్‌ను సంపాదించిపెట్టాయి. పుష్ప అద్భుత విజయంతో, అతను పోటీని మరింత తీవ్రతరం చేస్తూ పాన్-ఇండియా శక్తిగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. ప్ర‌భాస్, బ‌న్ని, మ‌హేష్‌, చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా రేస్ లో స‌త్తా చాటే స్టార్లుగా వెలిగిపోతున్నారు. దీనిని కేఆర్కే లాంటి క్రిటిక్స్ గ్ర‌హించాల్సి ఉంది.

Tags:    

Similar News