ఆ ప్ర‌తిష్టాత్మ చిత్రం షూటింగ్ అంతా విదేశాల్లోనే!

హృతిక్ రోష‌న్ హీరోగా 'క్రిష్ -4'కి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. గ‌త రెండేళ్ల‌గా ప్రాజెక్ట్ పై వ‌ర్క్ జ‌రుగుతుంది

Update: 2023-11-02 08:39 GMT

హృతిక్ రోష‌న్ హీరోగా 'క్రిష్ -4'కి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. గ‌త రెండేళ్ల‌గా ప్రాజెక్ట్ పై వ‌ర్క్ జ‌రుగుతుంది. ఇప్ప‌టికే బాగా ఆల‌స్య‌మైన నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎట్టి ప‌రిస్థితుల్లో 2024లో క్రిష్‌-4 లాంచ్ అవుతుంద‌ని యూనిట్ సైతం అధికారికంగా ప్ర‌క‌టించింది. సినిమా మార్కెట్ భారీగా రెట్టింపు అయిన నేప‌థ్యంలో అందుకు త‌గ్గట్టే చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.


భారీ బ‌డ్జెట్ తో చిత్రాన్ని క్రిష్ ప్రాంచైజీలోనే గొప్ప చిత్రంగా నిలిచిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. మూడు భాగాల్ని మించి నాల్గ‌వ భాగం ప్ర‌పంచ స్తాయిలో స‌త్తా చాటాలే స‌రికొత్త క‌థ ..క‌థ‌నాలు..సాంకేతికం అంశాల‌తో చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్లు స‌మాచారం. దీనిలో భాగంగా ప్రాజెక్ట్ కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు తెలిసాయి. సినిమాలో య‌ధావిధిగా ప్రియాంక చోప్రానే హీరోయిన్ పాత్ర‌కు తీసుకోవాల‌ని మేక‌ర్స్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

పీసీ గ్లోబ‌ల్ స్టార్ అయిన త‌ర్వాత హాలీవుడ్ లో స్థిర‌ప‌డిన నేప‌థ్యంలో ఆమె అంగీక‌రిస్తుందా? లేదా? అన్న మీమాంస ఉండేది. అయితే ఆమెతో సంప్ర‌దించిన నేప‌థ్యంలో సానుకూలంగా స్పందించిన‌ట్లు స‌మాచారం. పూర్తి స్థాయిలో ఆమె ఇంకా ప్రాజెక్ట్ ఒకే చేయ‌న‌ప్ప‌టికీ మేకర్స్ మాత్రం ఆమెతో రెగ్యుల‌ర్ గా ట‌చ్ లో ఉండ‌టం...చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం వంటివి చేస్తున్నారుట‌. ఇక ఈసినిమా షూటింగ్ అంతా విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారుట‌.

అంత‌ర్జాయ‌తీయంగా ప్రఖ్యాతి పొందిన లొకేష‌న్ల‌ల‌లో షూటింగ్ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. కొన్ని కీల‌క స‌న్నివేశాలు..షూటింగ్ తొలి షెడ్యూల్ సింగ‌పూర్ లో నిర్వ‌హించాల‌నుకుంటున్నారుట‌. అందుకు త‌గ్గ లొకేష‌న్లు కూడా ఇప్ప‌టికే చూసార‌ని స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. ఈ అప డేట్ ని బ‌ట్టి క్రిష్ -4ని ఏ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారో తెలుస్తుంది. సూప‌ర్ హీరోల చిత్రాల్లో ఓ బ్రాండ్ గా క్రిష్ -4ని తీసుకొచ్చే సీరియ‌స్ ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్లు చెప్పొచ్చు.

Tags:    

Similar News