'కుబేరా' కోసం మహేష్‌బాబు...!
షూటింగ్ ముగింపు దశకు చేరడంతో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయాలని దర్శకుడు శేఖర్ కమ్ముల నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో చేస్తున్న మూవీ 'కుబేర'. విభిన్న చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కుబేర సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు, తమిళంలో ఏక కాలంలో రూపొందుతున్న కుబేరా సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తోంది. షూటింగ్ ముగింపు దశకు చేరడంతో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయాలని దర్శకుడు శేఖర్ కమ్ముల నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
అందులో భాగంగానే ఇటీవల ఆసక్తికర పోస్టర్‌ను షేర్ చేయడం జరిగింది. నవంబర్ 15న కుబేర సినిమా ఫస్ట్ గ్లిమ్స్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ గ్లిమ్స్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయబోతున్నారు. మహేష్ బాబు విడుదల చేయడం ద్వారా కుబేర స్థాయి మరింత పెరగడంతో పాటు ఆ గ్లిమ్స్ కి మంచి స్పందన వస్తుందనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నిర్మాత సునీల్ నారంగ్‌తో పాటు పుస్కుర్ రామ్ మోహన్ విజ్ఞప్తి మేరకు మహేష్ బాబు ఈ గ్లిమ్స్ రిలీజ్ కి ఓకే చెప్పాడని తెలుస్తోంది.
శేఖర్ కమ్ముల సినిమాలు కెరీర్ ఆరంభంలో క్లాస్ అండ్ సైలెంట్‌గా ఉండేవి. కానీ ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో తన పంథాను మార్చుకున్న శేఖర్ కమ్ముల 'కుబేర'తో మరోసారి మాస్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లలో రూపొందుతున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న కారణంగా మ్యూజికల్‌గా భారీ విజయాన్నిసొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.
నాగార్జున మొదటి సారి ఒక పూర్తి స్థాయి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ధనుష్, నాగార్జున మధ్య ఉండే సన్నివేశాలు చాలా వైవిధ్యభరితంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. గ్లిమ్స్ తో సినిమాపై ఉన్న అంచనాలు పెంచే అవకాశాలు ఉన్నాయి. పైగా మహేష్ బాబు గ్లిమ్స్ ను విడుదల చేయబోతున్నాడు కనుక అంచనాలు అదే రేంజ్‌లో ఉండటం ఖాయం. గ్లిమ్స్ 1 అంటూ చెప్పడం వల్ల త్వరలోనే మరో గ్లిమ్స్ వీడియోను సైతం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి కుబేర సినిమాపై అంచనాలు భారీగా పెంచి ఆ తర్వాత విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.