విడిపోయినా ఏడాదికే నటి డేటింగ్!
బాలీవుడ్ నటి కుషా కపిల గురించి అవసరం లేదు. 'ఘోస్ట్ స్టోరీస్' తో వెలుగులోకి వచ్చిన బ్యూటీ అంతే వేగంగా ఎఫైర్లతోనూ వెలిగిపోయింది
బాలీవుడ్ నటి కుషా కపిల గురించి అవసరం లేదు. `ఘోస్ట్ స్టోరీస్` తో వెలుగులోకి వచ్చిన బ్యూటీ అంతే వేగంగా ఎఫైర్లతోనూ వెలిగిపోయింది. అర్జున్ కపూర్-మలైకా అరోరా మధ్య చిచ్చు పెట్టి కపూర్ బోయ్ కొత్త గాళ్ల్ ప్రెండ్ గా మరింత ఫేమస్ అయింది అందులో నిజం లేనప్పటికీ. బాలీవుడ్ లో మరింతగా ఫేమస్ అవ్వడానికి ఆ రూమర్ ఎంతోగానూ పనిచేసింది. అప్పటి నుంచి కుషా కపిల అంటే తెలియని వారెవ్వరూ లేదరు. సినిమాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్ లు కూడా అమ్మడికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
ట్యాలెంటెడ్ అయినా కొన్ని విమర్శలు ఆమెని ప్రత్యేకంగా టార్గెట్ చేసాయి. 2017 లోనే జోరావర్ సింగ్ అహ్లువాలియాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొన్నాళ్లకి విబేధాలు రావడంతో గతేడాది విడాకులతో వేరయ్యారు. విడిపోయిన తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కుంది. వ్యక్తిగతంగా ఆమెని టార్గెట్ చేసి రకరకాల ఇబ్బందులకు గురిచేసారు. దీంతో మళ్లీ మాజీ భర్త లైన్ లోకి వచ్చి కాపాడాల్సి వచ్చింది. విడిపోవడానికి కారణం కేవలం తాను ఒక్కర్తే కాదని..తన తప్పులు కూడా ఉన్నాయని చెప్పడంతో నెటి జనులు వెనక్కి తగ్గారు.
ఆ తర్వాత కొంత కాలానికి అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తుందని వార్తలొచ్చాయి. కానీ అవాస్తవమని తేలింది. ఈ నేపథ్యంలో అమ్మడు తాజాగా బాలీవుడ్ కమెడియన్ అనుభవ్ సింగ్ బస్సీ తో ప్రేమాయణం నెరుపుతున్నట్లు ప్రచారం సాగుతుంది. ఇద్దరు కలిసి ఉన్న కొన్ని ఫోటోలు..గోవా టూర్లకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతోనే! ఏదో జరుగుతోంది అన్న అనుమానం బలపడుతుంది.
మరి ఆసంగతేంటో తేలాలి. అనుభవ్ స్టాండప్ కమెడియన్. యూట్యూబర్ నుంచి ఆ స్థాయికి చేరుకున్నాడు. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. అతనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. సోషల్ మీడియా నుంచే భారీగా సంపాదిస్తున్నాడు. ఇటీవలే రణబీర్ కపూర్ నటించిన ఓ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం కొన్ని సినిమాలకు సైన్ కూడా చేసాడు. అవి సెట్స్ కి వెళ్లాల్సి ఉంది.