ఖుషి వంతు వచ్చింది.. ఇది రన్ టైమ్ లెక్క

ముఖ్యంగా హేషమ్ అబ్దుల్ వాహబ్​ అందించిన సంగీతం హైలైట్​గా నిలిచింది. ఇప్పటికీ సోషల్​మీడియాలో పాటలు బాగానే ట్రెండ్ అవుతున్నాయి

Update: 2023-08-30 06:31 GMT

టాలీవుడ్​లో నూతనోత్తేజాన్ని నింపింది ఆగస్ట్​ నెల. ఆరంభంలోనే సూపర్ స్టార్​ రజనీకాంత్‌ 'జైలర్‌'తో బాక్సాఫీస్‌ ముందు కలెక్షన్ల వర్షం కురిపిస్తే.. నెలాఖరున 'బెదురులంక 2012', 'బాయ్స్‌ హాస్టల్‌' లాంటి చిన్న చిత్రాలు బాగానే ఆడాయి. ఇప్పుడు ఆగస్టుకు వీడ్కోలు పలుకుతూ సెప్టెంబరు పోరుకు సిద్ధమవుతోంది తెలుగు బాక్సాఫీస్​. ఇందులో భాగంగానే సెప్టెంబరు తొలి వారంలో విజయ్‌ దేవరకొండ - సమంతల ఖుషి రాబోతుంది.

ఇదే టాలీవుడ్​లో నెక్స్ట్​ బిగ్గెస్ట్​ రిలీజ్​ సినిమా. ఈ చిత్రాన్ని మజిలీ, నిన్నుకోరి ఫేమ్​ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. లవ్​ అండ్ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా మంచి అంచనాలతో పాన్ ఇండియా రేంజ్​లో రిలీజ్​ అవుతోంది. సినిమాపై మంచి బజ్​ కూడా ఉంది. బాక్సాఫీస్​ వద్ద మంచి ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నారు.

ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్​ ఆగస్ట్ 31నుంచి ప్రారంభంకానుంది. అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫైనల్ కాపీ రన్ టైమ్​ 163 నిమిషాలు ఉన్నట్లు తెలిసింది. అంటే 2 గంటల 43 నిమిషాలు అన మాట. ఫస్ట్ హాప్​ గంట 19 నిమిషాలు ఉండగా.. సెకండ్ హాఫ్​ గంట 24 నిమిషాలు ఉందని తెలిసింది. అంటే తొలి భాగంతో పోలిస్తే రెండో భాగమే కాస్త ఎక్కువ సేపు నిడివి ఉంది.

ఇకపోతే ఈ సినిమాలో జయరామ్​, సచిన్ ఖేడాకర్, మురళి శర్మ, లక్ష్మి, అలి, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్​ అయ్యంగర్​, శరణ్య ప్రదీప్​ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా మైత్రి మూవీ మేకర్స్​ నిర్మించింది. హైబడ్జెట్​తోనే దీన్ని తెరకెక్కించారట. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్​, సాంగ్స్​, ట్రైలర్​ బాగానే ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా హేషమ్ అబ్దుల్ వాహబ్​ అందించిన సంగీతం హైలైట్​గా నిలిచింది. ఇప్పటికీ సోషల్​మీడియాలో పాటలు బాగానే ట్రెండ్ అవుతున్నాయి. శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. విజయ్​-సమంత కెమిస్ట్రీ బాగుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి మంచి హైప్​తో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ నెలకు ఉత్సాహాన్ని అందిస్తుందో లేదో.. అలానే ఫ్లాపుల్లో ఉన్న విజయ్​-సమంత-శివ నిర్వాణకు బ్రేక్​ ఇస్తుందో లేదో..

Tags:    

Similar News