ఆస్కార్ కి నామినేట్ అయిన 'లాపతా లేడీస్'
మరి ఈసినిమా ఆస్కార్ రేసులో నిలుస్తుందా? లేదా? అన్నది తర్వాత సంగతి.
కొన్ని గంటల క్రితమే బాలీవుడ్ చిత్రం `లాపతా లేడీస్` ఆస్కార్ కి భారత్ తరుపున అర్హత సాధిస్తుంది? అనే ధీమాని దర్శకురాలు కిరణ్ రావ్ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె నమ్మకం నిజమైంది. 2025 స్కార్ కోసం దేశం తరుపున అధికారికంగా ఈ సినిమా ఎంపికైంది. ఉత్తమ విదేశీ సినిమా విభాగంలో ఆస్కార్ కి పోటీ పడుతుంది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. దీంతో కిరణ్ రావ్ నమ్మకం నిజమైంది.
మరి ఈసినిమా ఆస్కార్ రేసులో నిలుస్తుందా? లేదా? అన్నది తర్వాత సంగతి. చిన్న సినిమా గా విడుదలైన మంచి సందేశాత్మకంగా నిలిచిందీ చిత్రం. రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైన ఇద్దరు గ్రామీణ ప్రాంత పెళ్లి కూతుళ్ల ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కిరణ్ రావ్ మాజీ భర్త, నటుడు అమిర్ ఖాన్ నిర్మాతగా వ్యవరించారు. ఈ సినిమా ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా అందుకుంది.
సుప్రీం కోర్టులోనూ ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. న్యాయ వ్యవస్థ మెచ్చిన చిత్రంగానూ నిలిచింది. రిలీజ్ అనంతరం విమర్శకుల ప్రశంసలం దుకున్న చిత్రంగానూ నిలిచింది. ఈ సినిమాలో స్పర్ష శ్రీవాత్సవ, నితాన్షీ గోయల్ ప్రధాన పాత్రలు పోషించారు. `రేసు గుర్రం` ఫేం రవి కిషన్ కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ప్లిక్స్ లో అందుబాటులో ఉంది.
కిరణ్ రావ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం 2011లో అమీర్‌ఖాన్ హీరోగా ‘ధోభీ ఘాట్’ అనే చిత్రంతో దర్శకురాలిగా మారారు. గతేడాది ‘లాపతా లేడీస్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ సినిమా కమర్శియల్ గా సక్సస్ అవ్వలేదు.