అవాస్తవాలు రాసారంటూ సుత్తివేలు సతీమణి కన్నీరు!
తాజాగా సుత్తివేలు సినీ ప్రస్తానం గురించి ఆయన సతీమణి లక్ష్మీరాజ్యం ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
తెలుగు తెర నవ్వుల సందడి సుత్తివేలు గురించి పరిచయం అవసరం లేదు. మూడు దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. హాస్య నటుడిగా ప్రేక్షకుల ఆయన వేసిన ముద్ర ఎప్పటికీ చెరగనది. నటనలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు. 80-90 దశకంలో సుత్తివేలు లేకుండా సినిమా ఉండేది కాదు. అంతగా ఆ కాలంలో ప్రాచుర్యం పొందిన నటుడాయన. అవార్డులు..రివార్డులు అందుకున్నారు.
'ముద్ద మందారం'తో నటుడిగా పరిచమయ్యారు. ఆ తర్వాత చివరిగా 2013 లో 'రామాచారి' చిత్రంలో నటించారు. ఆయన తదానంతరం సుత్తివేలు కుటుంబం నుంచి ఎవరూ ఇండస్ట్రీకి వచ్చింది లేదు. తాజాగా సుత్తివేలు సినీ ప్రస్తానం గురించి ఆయన సతీమణి లక్ష్మీరాజ్యం ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'సుత్తివేలు గారు నాటకాలు బాగా వేసేవారు. ఆయనను సినిమాలకి పరిచయం చేసిన జంధ్యాల గారిని మేమంతా ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటాము.
'త్రిశూలం' సినిమా తరువాత ఆయన వెనుదిరిగి చూడలేదు. ఆయనకి ధైర్యం ఎక్కువ. అదే ఆయన బలం. ఎవరు ఏం చెప్పినా? నిజానిజాలు తెలుసుకోకుండా. దానాలు చేయడం ఆయన బలహీనత. పిల్లలు సంపాదిస్తున్నా, తాను సంపాదించిన డబ్బు మాత్రమే ఖర్చు చేసేవారు. రాత్రి 12 గంటల వరకూ మాతో సరదాగా మాట్లాడారు. ఆ తరువాత నిద్రలోనే చనిపోయారు. అప్పటికి ఆయన వయసు 63 ఏళ్లు.
కానీ'సుత్తివేలు గారు ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడ్డారని యూట్యూబ్ లలోను చూశాను. అందులో ఎంత మాత్రం నిజం లేదు. అప్పటికీ ఆడపిల్లల పెళ్లిళ్లు కూడా చేసారు. అబ్బాయి మంచి జాబ్ చేస్తున్నాడు. సేవింగ్స్ ఉన్నాయి. చనిపోవడానికి ముందు వరకూ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. మరి ఎందుకిలా ప్రచారం చేస్తున్నారనేది అర్థం కాలేదు. అలాంటివి చూసినప్పుడు మనసుకు చాలా బాధగా అనిపిస్తుంద'ని కన్నీటి పర్యంతం చెందారు.