పారితోషికం ఎగ్గొట్టిన‌వారే ఎక్కువ‌!

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె త‌న‌కు ఎదురైన కొన్ని అనుభ‌వాలు..చేదు జ్ఞాప‌కాల గురించి గుర్తుచేసుకున్నారు.

Update: 2024-01-13 02:45 GMT

సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ల‌తా శ్రీ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. 'యమలీల'.. 'నెంబర్ వన్'.. 'ఆ ఒక్కటీ అడక్కు' లాంటి ఎన్నో చిత్రాల్లో న‌టించి న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించు కున్నారు. తెలుగ.., తమిళ.. కన్నడ భాషల్లో 70 కిపైగా చిత్రాల్లో నటించారు. ఇండ‌స్ట్రీలో చిట్టి చెల్లెలుగా ల‌తా శ్రీ ఎంతో ఫేమ‌స్. అప్ప‌టి స్టార్ హీరోల‌కు ఆమె చెల్లెలి పాత్ర‌లు ఎక్కువ‌గా పోషించ‌డంతో ఆరక‌మైన గుర్తింపు వ‌చ్చింది.

అలాంటి న‌టి 1999 తరువాత తెరమరుగైన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత చాలా కాలం పాటు సినిమాల‌కు దూరంగా ఉన్నారు. అటుపై మ‌ళ్లీ 2007లో ఈవీవీ సత్యనారాయణ 'అత్తిలి సత్తిబాబు' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. మ‌ళ్లీ ఈ మధ్య కాలంలో ఇంట‌ర్వ్యూల‌తో నెట్టింట వైర‌ల్ అవుతున్నారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె త‌న‌కు ఎదురైన కొన్ని అనుభ‌వాలు..చేదు జ్ఞాప‌కాల గురించి గుర్తుచేసుకున్నారు.

అవేంటో ఆమె మాట‌ల్లోనే.. 'క‌న్నడ నుంచి నాకు ఎక్కువ అవకాశాలు వస్తున్నప్పటికీ, మొదటి నుంచి తెలుగు పట్ల నేను ఆసక్తిని చూపించేదాన్ని. అందుకు కారణం మా అమ్మ‌గారే కార‌ణం. ఈవీవీ గారు .. ఎస్వీ కృష్ణారెడ్డిగారు మంచి పాత్రలనిచ్చి నన్ను ప్రోత్సహించారు. కృష్ణగారి సినిమాలు ఎక్కువగా చేసే ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావించాను.

చాలా సినిమాల్లో అవకాశాలు నా వరకూ వచ్చి చేజారిపోయేవి. 'మేజర్ చంద్రకాంత్' లో ఎన్టీఆర్ కుమార్తెగా .. 'అల్లుడా మజాకా' సినిమాలో ఊహ చేసిన పాత్రను నేను చేయవలసింది. ఆ ఛాన్స్ మిస్సవ్వడం కూడా చాలా బాధను కలిగించింది. అలా అవకాశాలు వచ్చి పోవడానికి కారణం ఏమిటనేది కూడా నాకు తెలిసేది కాదు. ఇక చేసిన సినిమాలకి సంబంధించి నాకు డబ్బులు ఇచ్చినవారికంటే ఎగ్గొట్టినవారే ఎక్కువ. అలా ఎందుకు చేసేవారో వాళ్ల‌కే తెలియాలి' అని అన్నారు.

Tags:    

Similar News