చీరకట్టులో అందాల రాక్షసి వయ్యారాలు.. వ్వాటే లుక్స్!

పీచ్ కలర్ చీరలో మెల్లగా మెరిసిపోతూ కనిపించిన లావణ్య ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Update: 2025-01-08 02:30 GMT

'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న లావణ్య, తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆమె కెరీర్ ప్రారంభంలోనే వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యారు. ఇక తాజాగా తన ట్రెడిషనల్ లుక్‌తో మళ్లీ సోషల్ మీడియాలో హీటెక్కించిన విధానం వైరల్ అవుతోంది.

 

పీచ్ కలర్ చీరలో మెల్లగా మెరిసిపోతూ కనిపించిన లావణ్య ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో ఆమె అందం అభిమానులను ఆకర్షిస్తోంది. ఈ లుక్‌లో సింప్లిసిటీకి గ్లామర్‌ జోడించి తనదైన స్టైల్‌ను చూపించారు. లావణ్య త్రిపాఠి తన డ్రెస్సింగ్ చాయిస్‌తో ఎల్లప్పుడూ ప్రత్యేకమై నిలుస్తారు, ఈ సారి కూడా అదే ప్రూవ్ అయ్యింది.

 

మెకప్ చాలా సాఫ్ట్‌గా ఉండగా, ఆమె సొగసైన జడ ధరించిన చెవిపోగులు, హుందాతనానికి తార్కాణంగా నిలిచాయి. అవకాశాలు తగ్గినా, సోషల్ మీడియాలో మాత్రం ఆమె క్రేజ్ తగ్గడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో లావణ్య తరచుగా తన అందాలను మెరిపిస్తూ, ఫ్యాన్స్‌ను కనువిందు చేస్తుంటారు. ఇటీవలనే ఆమె మెగా ఫ్యామిలీ కోడలిగా మారి కొత్త జీవితంలో అడుగు పెట్టారు.

ప్రొఫెషనల్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను సమన్వయం చేస్తూ కెరీర్‌లో మరో హిట్ కోసం సిద్ధమవుతున్నారు. ఆమె గత చిత్రాల విషయానికి వస్తే, 'మిస్టర్,' 'సోగ్గాడే చిన్ని నాయన,' 'భలే భలే మగాడివోయ్' వంటి బ్లాక్ బస్టర్స్ ఆమె కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చాయి. ప్రస్తుతం 'సతీ లీలావతి' అనే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆమెకు మరింత గుర్తింపు తీసుకొస్తుందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను నిలబెట్టుకున్న లావణ్య, పలు భాషల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ట్రెడిషనల్ లుక్‌తో అలా మెరిసిపోయిన ఈ ఫోటోలు, మరోసారి ఆమె తన అందాన్ని ఎలా ప్రదర్శించాలో చూపిస్తున్నాయి. 'సతీ లీలావతి'తో మరోసారి ప్రేక్షకులను మెప్పించే పనిలో ఉన్న లావణ్య త్రిపాఠి, ఫ్యాన్స్‌ను మరింతగా ఆకట్టుకుంటారనే ఆశాభావం ఉంది. చూడాలి మరి అమ్మడు ఎంతవరకు సక్సెస్ అందుకుంటుందో.

Tags:    

Similar News