రాజ్ తరుణ్ నాకొద్దు లావణ్య న్యూ ట్విస్ట్!

అయితే ఇప్పుడు ఊహించిన విధంగా రాజ్ తరుణ్ నాకు అవసరం లేదు అంటూ ఆమె మరో వివరణ ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Update: 2024-08-01 16:56 GMT

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య వివాదం ఏ స్థాయిలో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనతో సహజీవనం చేసి మరొక హీరోయిన్ తో సంబంధం పెట్టుకున్నాడు అంటూ ఆమె ఆరోపణలు చేసింది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసిన ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్ తరుణ్ ను వదిలను అని ఆమె మీడియా ముందు వివరణ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఊహించిన విధంగా రాజ్ తరుణ్ నాకు అవసరం లేదు అంటూ ఆమె మరో వివరణ ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

లావణ్య మాట్లాడుతూ.. ఇన్ని రోజులు నాలుగు గోడల మధ్య జరిగిన గొడవను నేను బయటకు తీసుకు వచ్చాను. ఎందుకంటే నాకు సహాయం దొరుకుతుంది అని అనుకున్నాను. రాజ్ తరుణ్ గురించి నేను ఎక్కడా బ్యాడ్ గా మాట్లాడలేదు. అయితే ఇప్పుడు అతను నాతో ఎలాంటి సంబంధం లేదు అంటున్నాడు, పెళ్లి చేసుకోలేదు అని అంటున్నాడు. ఇక అన్ని మాటలు మాట్లాడిన తర్వాత నేను కూడా అతన్ని వద్దని అనుకుంటున్నాను.

ఇన్ని రోజులు అతని కోసం నేను పోరాడింది నిజమే కానీ ఇప్పుడు వద్దని అనుకుంటున్నాను అని ఆమె తెలియజేసింది. అలాగే ఒక అమ్మాయి తో పెళ్లి చేసుకోకుండా ఇన్ని రోజులు ఉండడం అంటే అది అత్యాచారం కిందికే వస్తుంది. అతను ఆ సెక్షన్ కు కట్టుబడి ఉండాలి అనుకుంటున్నాను. శేఖర్ బాషతో రాజ్ తరుణ్ నాపై చేయించిన ఆరోపణలు నాకు బాధ కలిగించాయి. ఇక శేఖర్ బాషా చేసినటువంటి కారణాల వలన ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది.

వాళ్ళ ఇంటికి వెళ్తే నాపై తప్పుడు ఆరోపణలు చేసి కేసులు కూడా పెట్టారు. అసలు నా వల్ల వాళ్లకు ప్రాణహాని ఉంది అని అంటున్నారు. నేను కేవలం ఒక క్లారిటీ కోసం మాత్రమే వెళ్లాను. ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వడం లేదు. అతనితో పదేళ్లు ఉన్నాను కాబట్టి ఒక సమాధానం కోసం మాత్రమే నేను వాళ్ళ ఇంటికి వెళ్లడం జరిగింది. దానికి బదులుగా వాళ్ళు న్యూసెన్స్ కేసు పెట్టారు.

ఫైనల్ గా నేను కోరుకునేది ఏంటి అంటే రాజ్ తరుణ్ నాతో పదేళ్లు ఉన్నాడు. కాబట్టి అతన్ని నేను కావాలని కోరుకున్నాను. కానీ ఇప్పుడు అతనే నన్ను వద్దు అనుకుంటున్నాడు కాబట్టి బలవంతంగా నేను అతన్ని నా దగ్గరకు తీసుకురావాలని అనుకోవడం లేదు. అతను లేడని ఫొటోకు దండ వేసుకొని బ్రతికేస్తా. అయితే నాకు జరిగిన అన్యాయానికి తగిన న్యాయం మాత్రం జరగాలని కోరుకుంటున్నాను.. అని లావణ్య వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News