కాబోయే మెగా కోడలు పెళ్లికి ముందే ఏంటిలా?
అందుకే కొన్ని ముఖ్యమైన సినిమా ఆఫర్‌లను తిరస్కరించిందని, బోల్డ్ కంటెంట్ తో ఉండే వెబ్ సిరీస్‌ను కూడా తిరస్కరించిందని పుకారు వినిపిస్తోంది.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్‌లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. పరిశ్రమలో ప్రముఖ కుటుంబానికి చెందిన కోడలుగా తన కొత్త పాత్రకు అనుగుణంగా లావణ్య తన కెరీర్‌లో మార్పులు చేయవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. సినిమా అవకాశాల విషయంలో మరింత సెలెక్టివ్‌గా ఉండాలని ప్లాన్ చేస్తోంది. ఇటీవల కొన్ని ముఖ్యమైన ఆఫర్‌లను, వెబ్ సిరీస్‌లను తిరస్కరించింది. ఈ జంట జూన్‌లో నిశ్చితార్థంతో ఒకటయ్యారు. ఈ జంట తమ వివాహ ప్రణాళికలను అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ కి ప్లాన్ చేస్తున్నారని ఊహాగానాలు ఉన్నాయి. ఆ తర్వాత హైదరాబాద్‌లో విలాసవంతమైన రిసెప్షన్ ఉంటుంది. నవంబర్‌లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లికి ప్లాన్ చేస్తున్నారని కూడా గుసగుస వినిపిస్తోంది. పెళ్లికి ముందు తాజా పుకారు ఏమిటంటే.. కోడలిగా తన కొత్త పాత్రకు అనుగుణంగా లావణ్య తన కెరీర్‌లో గణనీయమైన మార్పులు చేయవచ్చని హింట్ అందింది.
పరిశ్రమలో మెగా కుటుంబానికి ఉన్న గొప్ప స్థానం దృష్ట్యా, ఎలాంటి వివాదాలు లేకుండా అన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి పెళ్లి తర్వాత తన సినిమా ఎంపికల్లో మరింత జాగ్రత్త తీసుకోవడం గురించి లావణ్య ఆలోచిస్తోంది. జూన్‌లో నిశ్చితార్థం జరిగినప్పటి నుండి లావణ్య త్రిపాఠి తన కెరీర్‌కు సంబంధించి నిర్ణయాల్లో మార్పులు చేసినట్లు కథనాలొస్తున్నాయి. ప్రభావవంతమైన మెగా ఫ్యామిలీకి ఆమె కమిట్‌మెంట్‌ల కారణంగా ఇబ్బంది ఎదురు కాకూడదని లావణ్య భావిస్తోంది.
అందుకే కొన్ని ముఖ్యమైన సినిమా ఆఫర్‌లను తిరస్కరించిందని, బోల్డ్ కంటెంట్ తో ఉండే వెబ్ సిరీస్‌ను కూడా తిరస్కరించిందని పుకారు వినిపిస్తోంది. ఆమె తన పాత్రకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనమని ప్రోత్సహించి, నిర్మాతలకు అడ్వాన్స్ చెల్లింపును తిరిగి వెనక్కి ఇచ్చిందని కూడా తెలుస్తోంది. ఈ పరిణామాలకు సంబంధించి నటి నుండి అధికారిక ధృవీకరణ ఏదీ లేదు. మెగా కోడలు కెరీర్ ఎంపికలు కుటుంబంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం లేదా వివాదాలను తీసుకురాకుండా చూసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు కనిపిస్తోంది.
ఈ జంట తమ వివాహ ప్రణాళికలకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, వారు ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు సిద్ధమవుతున్నారని ఊహాగానాలు సాగుతున్నాయి. వరుణ్ నిజానికి తన గోప్యతకు విలువ ఇస్తాడు. అభిరుచితో సింపుల్ వెడ్డింగ్ ని ఇష్టపడతాడు. అందుకే వారు తమ పెళ్లికి ఇటలీని ఎంచుకున్నారు. అతిథుల జాబితా కేవలం 50 మంది వ్యక్తులకు మాత్రమే పరిమితం కానుందని సమాచారం. వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రతిదీ ప్లాన్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట తమ పరిశ్రమ సహచరులు, రాజకీయ ప్రముఖులు,హైదరాబాద్‌లోని ప్రముఖ వ్యక్తుల కోసం విలాసవంతమైన రిసెప్షన్‌ను నిర్వహించాలని భావిస్తున్నట్టు కథనాలొస్తున్నాయి.
పెద్దల దీవెనలతో అంగరంగ వైభవంగా..
జూన్ 9న హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. త్వరలో జరగనున్న పెళ్లి వేడుకల్లోను మెగా పెద్దలంతా కొత్త జంటను ఆశీర్వదిస్తారు. ఈ పెళ్లిలో మెగా హీరోలందరి సందడి ఉంటుంది. అంతరిక్షం 9000 KMPH -మిస్టర్ వంటి సినిమాల్లో కలిసి పని చేస్తున్నప్పుడు వారి మధ్య ప్రేమ వికసించింది. ఇరువురి మధ్యా బంధం ఇప్పుడు పెళ్లితో మరో స్థాయికి చేరుకోబోతోంది. పెద్దలు, దేవతల దీవెనలతో కొత్త జంట ఆనందకర జీవితాన్ని గడిపేందుకు సిద్ధమవుతోంది.