చంద్రముఖి 2... హీరోకు మంచి లాభమే..
తాజాగా ఇప్పుడు లారెన్స్ రెమ్యునరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. దాదాపు రూ.25 కోట్ల వరకు అందుకున్నారని తమిళ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
తమిళ స్టార్ రాఘవ లారెన్స్ - బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కాంబినేషన్లో తెరకెక్కిన హార్రర్ కామెడీ చిత్రం చంద్రముఖి 2. పి. వాసు దర్శకుడిగా వ్యవహరించారు. అప్పట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ - పి.వాసు కాంబోలో వచ్చి ఘన విజయం సాధించిన చంద్రముఖికి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా కాస్త పెద్ద బడ్జెట్ వెచ్చించి మరీ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.
అయితే రీసెంట్గా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈ చిత్రం మంచి లాభాలను రిలీజ్‌కు ముందే అందుకుందని తెలిసింది. హీరోగా నటించిన రాఘవ లారెన్స్ కూడా రికార్డ్ రెమ్యునరేషన్‌ను అందుకున్నారట. చంద్రముఖి బ్రాండ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌కు బాగా ఉపయోగపడిందట. నాన్ థియేట్రికల్, థియేట్రికల్ రైట్స్.. అన్నీ భారీ ధరకు అమ్ముడుపోయాయని సమాచారం అందింది.
తాజాగా ఇప్పుడు లారెన్స్ రెమ్యునరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. దాదాపు రూ.25 కోట్ల వరకు అందుకున్నారని తమిళ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే అంత పెద్ద మొత్తం లారెన్స్ అందుకోవడం అంటే ఎవరూ ఊహించనిదే అని చెప్పాలి. అందుకే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.
ఇక ఈ సినిమా విషయానికొస్తే.. అప్పట్లో మొదటి భాగం తమిళ, తెలుగు భాషల్లో ఘన విజయాన్ని సాధించగా ఇప్పుడు సీక్వెల్ మాత్రం చతికిలపడింది. ఈ సినిమాలో ప్రధాన తారాగణం అంతా మారిపోయింది. రజనీ స్థానంలో రాఘవ లారెన్స్ హీరోగా నటించగా.. చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ కనిపించింది.
కంగనా, లారెన్స్ నటన, చంద్రముఖి, వేటయ్యరాజుల ఫ్లాష్‌బ్యాక్, క్లైమాక్స్ సీన్స్ సినిమాకు బలంగా నిలిచాయి. కానీ నెమ్మదిగా సాగే ప్రధమార్ధం, కొత్తదనం లేని స్క్రీన్‌ప్లే, ఊహలకు తగ్గట్లుగా సాగే కథనం మైనస్. ఫైనల్‌గా ఈ చంద్రముఖి భయపెట్టడం కానీ థ్రిల్ పంచడం కానీ చేయలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.