ఆషికీ 3 ...టి సిరీస్‌కి లీగల్ నోటీసులు
ఇప్పుడు వరుసగా నాలుగైదు భారీ చిత్రాలను టి సిరీస్ లైన్ లో పెట్టింది.
సౌత్ నార్త్ లో వరుస సినిమాలను నిర్మిస్తూ సంచలనంగా మారుతోంది టి - సిరీస్. ఈ బ్యానర్ నుంచి ఇటీవల విడుదలైన `యానిమల్` భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు వరుసగా నాలుగైదు భారీ చిత్రాలను టి సిరీస్ లైన్ లో పెట్టింది. భవిష్యత్ లో ప్రభాస్ - సందీప్ వంగాలతో కలిసి మరిన్ని భారీ చిత్రాలకు టిసిరీస్ ప్లాన్ చేస్తోంది.
అయితే తాజాగా అందిన సమాచారం మేరకు.. కార్తీక్ ఆర్యన్ తో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆషికి 3`కి సమస్య ఏర్పడింది. 1981లో `బసేరా` చిత్రాన్ని రూపొందించిన దివంగత నిర్మాత రమేష్ బెహ్ల్ కుటుంబం `ఆషికీ 3` నిర్మాణ సంస్థ అయిన టి-సిరీస్‌కు లీగల్ నోటీసు పంపింది. దీనికి కారణం `బసేరా` లైన్ కి సమానంగా ఆషిఖి 3 కథాంశం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారట.
ఆషికీ 3 నిర్మాతలు తమ అనుమతి లేకుండా `బసేరా`లోని ఎలాంటి కథాంశం, పాత్రలు లేదా మేధో సంపత్తిని ఉపయోగించరాదని బెహ్ల్ కుటుంబం తరపు న్యాయవాది పేర్కొన్నారు. బసేరా హక్కులు తమకు మాత్రమే చెందుతాయని వారు వాదిస్తున్నారు.
టి-సిరీస్ లీగల్ నోటీసుకు ఇప్పటివరకు స్పందించలేదు. బెహ్ల్ కుటుంబం లేదా టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ కానీ ఇంకా స్పందించలేదు. దీంతో ఆషిఖి 3 ప్రాజెక్ట్ ఇప్పటికి డైలమాలో ఉంది. ఆషిఖి 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాతలే ఆషికి 3ని నిర్మిస్తున్నారు. దీనికోసం ఇప్పటికీ కథానాయిక ఎవరు? అన్నది ఫైనల్ చేయలేదు.
ట్రిప్టి డిమ్రీ, తారా సుతారియా వంటి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. కార్తీక్ ఆర్యన్ `ఆషికీ 3` ప్రారంభానికి ముందే అడ్డంకులు ఎదుర్కొంటోంది. ఈ చిత్రం న్యాయపరమైన సవాలును అధిగమించి ముందుకు సాగుతుందా లేదా అన్నది వేచి చూడాలి.