400కోట్లకు లెజెండరీ హీరో ఇల్లు అమ్మకం
దేవ్ ఆనంద్ జుహు ఇల్లు 400 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది అంటూ హిందీ మీడియాలో ఇప్పటికే గుసగుసలు మొదలయ్యాయి.
ఇటీవల రాజ్ కపూర్ లకు చెందిన ఖరీదైన ఫిలిం స్టూడియో ఆర్కే ఫిలింస్టూడియోని ప్రముఖ కార్పొరెట్ కంపెనీకి విక్రయించడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇంతలోనే మరో ప్రముఖ హిందీ నటుడు తన ఇంటిని 400కోట్లకు అమ్మేశారు. ముంబై- జుహులో ఉన్న ప్రముఖ నటుడు దేవ్ ఆనంద్ ఇంటికి కొత్త యజమాని దొరికినట్లు సమాచారం. దీనిపై ఇంతకుముందే వార్తలు వెలువడినా, ఇప్పటివరకూ డీల్ పూర్తి కాలేదు.
తాజా కథనాల ప్రకారం.. ఈ డీల్ పూర్తయింది. దివంగత సూపర్‌స్టార్ దేవానంద్ తన జీవితాన్ని భార్య కల్పనా కార్తీక్, పిల్లలు సునీల్ ఆనంద్ - దేవీనా ఆనంద్‌తో గడిపిన ఇంటిని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి భారీ మొత్తానికి విక్రయించారు. ఇల్లు నగరంలోని ఒక ప్రైమ్ లొకేషన్ లో ఉంది. ఇప్పుడు యజమాని దానిని బహుళ-అంతస్తుల టవర్‌గా మార్చాలనుకుంటున్నారు. డీల్ ఇటీవల ఖరారు అయింది. పేపర్‌వర్క్ పూర్తయిన తర్వాత పని ప్రారంభమవుతుందని తెలిసింది.
దేవ్ ఆనంద్ జుహు ఇల్లు 400 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది అంటూ హిందీ మీడియాలో ఇప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. హిందుస్థాన్ టైమ్స్‌లోని ఒక కథనం ప్రకారం.. దేవ్ ఆనంద్ ఇంటిని 22-అంతస్తుల టవర్‌గా మార్చనున్నారు. ముంబై జుహూలోని ఈ ఏరియా అత్యంత ఖరీదైనది. దానిని ఒక అగ్ర రియల్ ఎస్టేట్ కంపెనీ కొనుగోలు చేసింది. డీల్ లాక్ అయిందని, పేపర్ వర్క్ ప్రక్రియలో ఉందని సమాచారం. ఈ ప్రాంతంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల బంగ్లాలు ఉన్న ప్రధాన ప్రదేశం కనుక దీనిని సుమారు 400 కోట్లకు విక్రయించారు``అని ఒక కథనం చెబుతోంది.
ఒకప్పుడు ఈ ఇంటి చుట్టూ బాలీవుడ్ సెలబ్రిటీలు ఎందరో నివశించారు. డింపుల్ కపాడియా -మాధురీ దీక్షిత్‌తో సహా అగ్రశ్రేణి నటీనటులు ఒకప్పుడు బంగ్లా ప్రాంగణం చుట్టూ నిర్మించిన అపార్ట్‌మెంట్లలో నివసించారని కూడా టాక్ ఉంది. ప్రముఖ స్టార్ దేవానంద్ హోమ్ ఇప్పుడు 22 అంతస్తుల పొడవైన టవర్ గా రూపాంతరం చెందుతుంది. దేవ్ ఆనంద్ తన కలల ఇంటి గురించి గతంలో ఓసారి పలు విషయాలను మాట్లాడారు.
అతను 1950లో తన ఇంటిని నిర్మించినప్పుడు, ఆ స్థలం ఎక్కడ ఉందో పెద్దగా ఎవరికీ తెలియదని జుహు ఒక అరణ్యం ఉండేదని, దానితో ప్రేమలో పడ్డానని మీడియాకు చెప్పారు. దేవ్ ఆనంద్ మాట్లాడుతూ జుహు అప్పట్లో ఒక చిన్న గ్రామం అని, అక్కడ మొత్తం అరణ్యం ఉండేదని కూడా తెలిపాడు. జుహూలో నివసించడం తనకు ఇష్టమని కూడా దేవానంద్ అన్నారు. ఎందుకంటే హృదయంలో అతను ఒంటరివాడు. జుహు రద్దీగా మారిందని, ముఖ్యంగా ఆదివారాల్లో చాలా మంది ప్రజలు అక్కడికి వస్తుంటారని దేవ్ ఆనంద్ తెలిపారు. ఇది ఇకపై అదే పాత రోజుల్లోని బీచ్ కాదు. నా ఐరిస్ పార్క్ కూడా ఇక్కడ లేదు. నా స్థలానికి ఎదురుగా పాఠశాల, నాలుగు బంగ్లాలు ఉండేవి అని దేవానంద్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.