లెజెండ్ ఆన్ సెట్స్ నుంచి దిగేసాడు!
ఎంతో ఫేమస్ బిజినెస్ మ్యాన్ అయిన శరవణన్ 'ది లెజెండ్' సినిమాతో ఏకంగా పాన్ ఇండియాలోనే లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
వ్యాపార వేత్తలు హీరోలగా మారడం అనేది చాలా రేర్. సంపాదనతో నిర్మాణ సంస్థల్ని స్థాపించి నిర్మాత లుగా ఎదిగే ఆలోచనే వాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఈ బిజినెస్ మ్యాన్ వాళ్లకి భిన్నం. సంపాదన కాదు..నటనపై ఆసక్తి..ఫేం కోసం ఏకంగా ముఖానికి మ్యాకప్ వేసుకుని హీరోగా ఎంట్రీ ఇచ్చిన శరవణన్ గురించి పరిచయం అవసరం లేదు. ఎంతో ఫేమస్ బిజినెస్ మ్యాన్ అయిన శరవణన్ `ది లెజెండ్` సినిమాతో ఏకంగా పాన్ ఇండియాలోనే లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
న్యూ శరవణన్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్ పై స్థాపించి తొలి సినిమా ‘ ది లెజెండ్’ ని భారీ బడ్జెట్ తోనే నిర్మించారు. దాదాపు 80 కోట్ల వరకూ ఈ సినిమాకి ఖర్చు చేసారు. కానీ ఆ సినిమాకి పెట్టుబడిలో పావుశాతం కూడా రాలేదు. ఆ సినిమా భారీ నష్టాల్నే తెచ్చి పెట్టింది. అయినా తగ్గేదేలే అంటూ కొత్త సినిమాని పట్టాలెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పుడా సినిమాకి కొనసాగింపు గా తెరకెక్కి స్తున్నారా? మరో కథ అన్నది తెలియదు గానీ లెజెండ్స్ నెక్స్ట్ అంటూ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించారు.
ప్రస్తుతం ఆ సినిమా సెట్స్ లో ఉంది. ఈ సందర్భంగా ఆన్ సెట్స్ నుంచి కొన్ని ఫోటోల్ని షేర్ చేసారు. మంచు కొడల్లో హీరో పై షూట్ కి సంబంధించిన ఫోటోలివి. మంచులో హీరో చిద్విలాసం గమినించొచ్చు. బ్యాక్ గ్రౌండ్ లో మంచు సరస్సు..ఆ వెనుక ఇళ్లు అన్నీ స్విట్జర్లాండ్ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. బ్లాక్ అండ్ బ్లాక్ లో శరవణన్ లుక్ బాగుంది. కళ్లకు గ్లాసెస్ ధరించి కనిపిస్తున్నాడు. మరో ఫోటోలో అవే దుస్తులపై క్రీమ్ కలర్ కోట్ ధరించి కెమెరాకి ఫోజులిచ్చినట్లు తెలుస్తోంది.
శరవణన్ లుక్ లో మార్పులొచ్చాయి. మునుపటి కన్నా మరింత సన్నగా మారినట్లు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈసినిమాకి కూడా భారీగానే ఖర్చు చేస్తున్నట్లు కనిపిస్తుంది. క్వాలిటీ పరంగా శరవణన్ సినిలు రిచ్ గా ఉంటాయి. స్టార్ హీరోయిన్లు ఉంటారు. తన సినిమా వేడుకలకు అతిరథ మహరధుల్ని సైతం తీసుకొస్తుంటారు. తొలి సినిమా ది లెజెండ్ ని పెద్ద ఎత్తున ప్రమోటం చేసిన సంగతి తెలిసిందే. మరి తాజా చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్నది చూడాలి.