పైరసీపై చట్టసవరణ.. జైలు జరిమానా ఎవరికి?
సినిమాటోగ్రఫీ బిల్లు చట్ట సవరణల గురించి చాలా కాలంగా పరిశ్రమల్లో చర్చ సాగుతోంది. అయితే అన్నిచర్చలకు ముగింపు పలుకుతూ ఇటీవల పార్లమెంట్ లో బిల్లు పాసైంది.
సినిమాటోగ్రఫీ బిల్లు చట్ట సవరణల గురించి చాలా కాలంగా పరిశ్రమల్లో చర్చ సాగుతోంది. అయితే అన్నిచర్చలకు ముగింపు పలుకుతూ ఇటీవల పార్లమెంట్ లో బిల్లు పాసైంది. అయితే మారిన చట్టం ప్రకారం.. థియేటర్లలో పైరసీ చేసేవాళ్లకు ఎలాంటి శిక్షలు ఉంటాయి? అంటే దానికి సమాధానం దొరికింది. ఎవరైనా ఆడియెన్ లేదా అభిమాని థియేటర్లలో సినిమా చూస్తూ ఏదైనా వీడియో క్లిప్ ని ఫోటో క్లిప్ లను పైరసీ చేస్తే లేదా పూర్తి సినిమాని కాపీ చేస్తే వారిపై జరిమానా ఆషామాషీగా ఉండదని ఈ కొత్త బిల్లు చెబుతోంది. మూడేళ్ల జైలుతో పాటు సినిమా బడ్జెట్లో 5శాతం చెల్లించాలని కొత్త రూల్ ని ఈ బిల్లు ప్రతిపాదించింది.
ఒకవేళ ఇది అమల్లోకి వస్తే థియేటర్లలో ఉత్సాహంగా వీడియోలు చిత్రీకరించే ఫ్యాన్స్ సహా సామాన్య ప్రజలకు బిగ్ పంచ్ పడనుంది. నిజానికి పైరసీని నిలువరించాలని ఈ రూల్ ని తెచ్చినా కానీ నిజమైన పైరేట్లు దొరికేందుకు ఛాన్సే లేదు. ఎందుకంటే వారంతా పైరసీ చేసేది విదేశీ థియేటర్ల నుంచి. ఇక్కడ మెట్రోల్లో మల్టీప్లెక్స్ థియేటర్లు లేదా సింగిల్ స్క్రీన్ల నుంచి పూర్తి సినిమాని పైరసీ చేయడం లేదు. పైరసీ మాఫియాలు ఎంతో తెలివిగా విదేశాల్లో కాపీ చేస్తున్నాయి. అక్కడ చట్టాలను అనుసరించి దీనిపై శిక్షలు ఏవీ ఉండవు కాబట్టి ఈ ధీమా.
అయితే సినిమాటోగ్రఫీ చట్టసవరణ బిల్లు ప్రకారం.. ఇకపై థియేటర్లలో తమకు నచ్చిన సన్నివేశం వచ్చిందనో లేదా నచ్చిన హీరోయిన్ లేదా హీరో తెరపై కనిపించారనో ఫోటోలు వీడియో లకు ప్రయత్నిస్తే వెంటనే పంచ్ పడిపోయేది సామాన్య వీక్షకులకే. ఇకపై ఈ స్పీడ్ కి చెక్ పడినట్టేననడంలో సందేహం లేదు. పోలీస్ కేసులు కోర్టు గొడవలు అంటూ లైఫ్ లోకి రిస్కుని ఆహ్వానించేందుకు ఎవరైనా సిద్ధంగా ఉంటారా? అందుకే ఇక థియేటర్లకు వెళ్లే సామాన్య సినీవ్యూవర్స్ కి టెన్షన్ మొదలైనట్టే.