తెలుగు నిర్మాతపై 'లియో' ట్రోల్స్!

అయితే ఈ సందర్భంగా లియో సినిమాని తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తోన్న నిర్మాత నాగ వంశీ ఇంటరెస్టింగ్ కామెంట్ చేశారు.

Update: 2023-10-06 04:12 GMT

ఇళయదళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న లియో సినిమాని తెలుగులో నాగవంశీ ఏకంగా 22 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఈ మూవీని తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా రిలీజ్ చేసే ప్లాన్ కూడా చేస్తున్నారు. లియోకి పోటీగా బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతూ ఉండటంతో పోటీ గట్టిగానే ఉండబోతోంది.

అయితే ఈ సందర్భంగా లియో సినిమాని తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తోన్న నిర్మాత నాగ వంశీ ఇంటరెస్టింగ్ కామెంట్ చేశారు. లియో మూవీ హక్కులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి బాలయ్య ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన పని లేదని. భగవంత్ కేసరి సినిమాకి ఎన్ని థియేటర్స్ అవసరం ఉంటాయో అన్నింట్లో రిలీజ్ అవుతుందని అన్నారు.

ఈ వ్యాఖ్యలు బాలయ్య ఫ్యాన్స్ కి హ్యాపీ ఇచ్చాయి. అదే సమయంలో విజయ్ అభిమానులకి కోపం తెప్పించాయి. అసలే కోలీవుడ్ లో ఆడియన్స్ తెలుగు సినిమాలపై నిత్యం ఏదో ఒక రకంగా ఏడుస్తూ ఉంటారు. అలాగే వారి సినిమాలని ప్రోత్సహించడం లేదని కామెంట్స్ చేస్తారు. ఇప్పుడు లియో సినిమాని డిస్టిబ్యూట్ చేస్తోన్న నాగ వంశీ మూవీని చంపేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేయడం మొదలు పెట్టారు.

తక్కువ థియేటర్స్ కి లియో చిత్రాన్ని పరిమితం చేసి మాతృభాష చిత్రాన్ని ప్రోత్సహిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ అంశంపై నాగవంశీ రియాక్ట్ అయ్యారు. లియో హక్కులని భారీ ధర పెట్టి తాను కొన్నప్పుడు సినిమాపై లాభాలు రావాలని అనుకుంటాను కాని నష్టపోయే పని మాత్రం చేయను. ఏ సినిమాకి ఉన్న ప్రాధాన్యత ఆ సినిమాకి ఉంటుందని చెప్పడమే తన ఉద్దేశ్యం అని అన్నారు.

లియో చిత్రాన్ని నాశనం చేస్తే నష్టపోయేది నేనే అని క్లారిటీ ఇచ్చారు. నాగ వంశీ వివరణతో దళపతి అభిమానులు సంతృప్తి చెందుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే తాజాగా వచ్చిన లియో ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచేసింది. మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నట్లు ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది.

Tags:    

Similar News