లియో మనమే ఎక్కువ ఊహించుకుంటున్నామా..?
లియో గ్లింప్స్ క్రేజీగా అనిపించగా సినిమా ట్రైలర్ కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూశారు. లియో ట్రైలర్ చూశాక మాత్రం ఆడియన్స్ కాస్త అసంతృప్తి చెందారు.
విక్రం సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమా అంటే చాలు ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. అతను తీసిన ఖైదీ, మాస్టర్, విక్రం ఈ సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించాయి. విక్రం అయితే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఇదే ఊపుతో దళపతి విజయ్ తో లియో అంటూ మరో క్రేజీ మూవీ చేశాడు లోకేష్. కోలీవుడ్ లో ఈ కాంబో సినిమాకు ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఉన్నాయి. తెలుగులో కూడా విక్రం తర్వాత లోకేష్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. విజయ్ లోకేష్ కలయిక అనగానే ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి.
లియో గ్లింప్స్ క్రేజీగా అనిపించగా సినిమా ట్రైలర్ కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూశారు. లియో ట్రైలర్ చూశాక మాత్రం ఆడియన్స్ కాస్త అసంతృప్తి చెందారు. ట్రైలర్ మొత్తం ఎక్కువ వైలెన్స్, పెద్ద గొంతేసుకుని అరవడం తప్ప పెద్దగా ఏం లేదు. భారీ ప్రొడక్షన్ వాల్యూస్.. విజయ్ వెర్సటాలిటీ కనిపిస్తున్నా ఎందుకో సినిమా ట్రైలర్ లో లోకేష్ మార్క్ కనిపించలేదు అని టాక్.
లియో సినిమా మీద తమిళ ఆడియన్స్ లో అంచనాలు ఉండటం సహజం కానీ తెలుగు ఆడియన్స్ కూడా లియో మీద భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు. ట్రైలర్ చూశాక మనమే ఎక్కువ ఊహించేసుకున్నాం అని అనుకుంటున్నారు. అయితే ట్రైలర్ తో ఇలా మిస్ గైడ్ చేసి సినిమాలో తన టాలెంట్ చూపించడం లోకేష్ కి అలవాటే.. మరి అలా లియో థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ తో వావ్ అనిపిస్తాడా లేదా అన్నది చూడాలి.
లియో సినిమాలో త్రిష, ప్రియాంక మోహన్ హీరోయిన్స్ గా నటించారు. సినిమాలో విజయ్ డ్యుయల్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తుంది. అనిరుద్ మ్యూజిక్ కూడా మరోసారి లోకేష్ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచేలా ఉంది. ఈ దసరాకి రిలీజ్ అవుతున్న లియో ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుంది అన్నది చూడాలి. వరల్డ్ వైడ్ గా లియో బిజినెస్ థలపతి విజయ్ రేంజ్ తెలిసేలా చేస్తుంది. వరల్డ్ వైడ్ 230 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ చేసిన లియో సినిమా తెలుగు రైట్స్ కోసం 22 కోట్ల దాకా పెట్టినట్టు తెలుస్తుంది. దసరాకి బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వర రావు సినిమాలు కూడా వస్తున్నాయి. వాటికి లియో ఎంత గట్టి పోటీ ఇస్తుందో చూడాలి.