లియో వరల్డ్ వైడ్ బిజినెస్.. టార్గెట్ ఎంతంటే?
ఇక బిజినెస్ లెక్కలు చూసుకుంటే తమిళనాడులో వంద కోట్ల బిజినెస్ చిత్రంపై జరిగింది. తరువాత అత్యధికంగా ఓవర్సీస్ లో 65 కోట్లని అన్ని భాషలకి సంబందించిన హక్కులని కొనుగోలు చేశారు.
ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ లియో. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు. దసరా కానుకగా థియేటర్స్ లోకి వస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే లియో కథ కూడా ఉండబోతోంది. మాస్టర్ మూవీ తర్వాత లోకేష్, విజయ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ హై అండ్ లోనే ఉన్నాయి.
ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తోంది, ప్రియా ఆనంద్ మరో కీలక పాత్రలో కనిపించబోతోంది. సంజయ్ దత్, అర్జున్ సర్జా విలన్స్ గా నటించారు. తాజాగా మూవీ సెన్సార్ పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. ఇదిలా ఉంటే ఇప్పటికే మూవీ థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ బిజినెస్ కంప్లీట్ అయ్యింది. విజయ్ కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్ లియో చిత్రంపై జరగడం విశేషం.
ఇక బిజినెస్ లెక్కలు చూసుకుంటే తమిళనాడులో వంద కోట్ల బిజినెస్ చిత్రంపై జరిగింది. తరువాత అత్యధికంగా ఓవర్సీస్ లో 65 కోట్లని అన్ని భాషలకి సంబందించిన హక్కులని కొనుగోలు చేశారు. తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 22 కోట్లకి సితారా ఎంటర్టైన్మెంట్స్ లియో హక్కులు దక్కించుకుంది. విజయ్ కెరియర్ లోనే తెలుగులో ఇది హైయెస్ట్ డీల్.
కేరళలో 16 కోట్లకి హక్కులు అమ్ముడయ్యాయి. కర్ణాటకలో 15 కోట్ల బిజినెస్ జరిగింది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 10 కోట్ల వరకు లియో మూవీపై డీల్స్ సెట్ అయినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా 228 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ లియో మూవీపైన జరిగింది. 230 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది.
విజయ్ మార్కెట్ లెక్కల ప్రకారం, గత చిత్రాల సక్సెస్ ట్రాక్ చూసుకున్న మొదటి వారంలోనే ఈ కలెక్షన్స్ ని ఈజీగా అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమా సూపర్ హిట్ అయితే మాత్రమే కోలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఈ ఏడాది కోలీవుడ్ లో జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 600 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ రికార్డ్ ని లియో బ్రేక్ చేస్తుందా లేదా చూడాలి.