రజనీ అనారోగ్యం... లోకేష్‌ కనగరాజ్ తీవ్ర ఆగ్రహం!

రజనీకాంత్‌ అనారోగ్యంకు కారణం లోకేష్ కనగరాజ్ అంటూ కొందరు సోషల్‌ మీడియాలో వీడియోలు షేర్‌ చేశారు.

Update: 2024-10-05 05:47 GMT
రజనీ అనారోగ్యం... లోకేష్‌ కనగరాజ్ తీవ్ర ఆగ్రహం!
  • whatsapp icon

తమిళ్ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్‌ అయిన విషయం తెల్సిందే. మూడు రోజుల చికిత్స తర్వాత రజనీకాంత్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. రజనీకాంత్‌ ఆరోగ్యం విషయంలో ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్యం బాగానే ఉందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా సర్జరీ ఏంటి.. కడుపు నొప్పి ఏంటో అంటూ అంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై సోషల్‌ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తూ వచ్చారు. రజనీకాంత్‌ అనారోగ్యంకు కారణం లోకేష్ కనగరాజ్ అంటూ కొందరు సోషల్‌ మీడియాలో వీడియోలు షేర్‌ చేశారు.

రజనీకాంత్‌ అనారోగ్యం విషయంలో మీడియాలో వస్తున్న వార్తలు, ముఖ్యంగా యూట్యూబ్‌ లో కొందరు షేర్ చేస్తున్న వీడియోలపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ సీరియస్‌ అయ్యారు. కూలీ సినిమా షూటింగ్‌ సమయంలో రజనీ సర్ ఆరోగ్యం చెడి పోయిందని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. యూట్యూబర్లు చాలా కాన్ఫిడెన్స్ తో ఫేక్‌ వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలను గురించి చెప్పేప్పుడు కాస్త ఆలోచించాలి. ఫేక్ వార్తలను బాగానే అమ్ముకుంటున్నారు కానీ, అసలు విషయం ఏంటంటే రజనీ సర్‌ కూలీ సినిమా షూటింగ్‌ లో అనారోగ్యం పాలవ్వలేదు అన్నారు.

లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ... కూలీ సినిమా షూటింగ్‌ సమయంలో రజనీకాంత్‌ సర్‌ ఆరోగ్యం పాడైందని వస్తున్న వార్తలు నిజం కాదు. ముందుగానే ప్లాన్‌ చేసుకున్న ప్రకారం రజనీ సర్ సర్జరీ జరిగింది. అంతే తప్ప ఆయన ఆరోగ్యం పాడైపోవడం వల్ల ఆసుపత్రికి వెళ్లలేదు. కూలీ షూటింగ్‌ లో తలైవర్ ఆరోగ్యం పాడైపోవడం నిజం కాదని, అందులో ఎలాంటి వాస్తవం లేదు కనుక ఇకపై అయినా అలాంటి పుకార్లను నమ్మవద్దు అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. కూలీ సినిమా కంటే ముఖ్యంగా మాకు రజనీ కాంత్‌ సర్ ఆరోగ్యం ముఖ్యమని సైతం లోకేష్ కనగరాజ్ స్పందించారు.

సోషల్‌ మీడియాలో రజనీకాంత్‌ గురించి వస్తున్న పుకార్లకు లోకేస్ బ్రేక్ వేశాడని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో తమిళనాట మాత్రమే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ అంతకు మించి అన్నట్లుగా రజనీ కాంత్‌ తో కూలీ సినిమాను రూపొందిస్తున్నారు. అందుకు సంబంధించిన షూటింగ్‌ సగానికి పైగా పూర్తి అయిందని, వచ్చే ఏడాది సమ్మర్ లోనే సినిమా విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా పై రజనీకాంత్‌ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. కమల్‌ హాసన్ కు విక్రమ్‌ తో భారీ విజయాన్ని అందించిన లోకేష్ ఈసారి రజనీకాంత్‌ సర్ కి కూలీ సినిమాతో బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఖాయం, తమిళ్‌ సినీ ఇండస్ట్రీలో మొదటి వెయ్యి కోట్ల సినిమాగా కూలీ నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

Tags:    

Similar News