సూపర్ స్టార్ రేంజ్ ఎలివేషన్లు ఉండవా లోకీ!
కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ `ఖైదీ` తర్వాత పాన్ ఇండియాలో సంచలనమైన సంగతి తెలిసిందే.
కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ `ఖైదీ` తర్వాత పాన్ ఇండియాలో సంచలనమైన సంగతి తెలిసిందే. `ఖైదీ`తో ఎల్ సీయూని పరిచయం చేసి తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని ముందుకెళ్తున్నాడు. ఎల్ సీయూ నుంచి మరిన్ని చిత్రాలు వస్తాయని...వచ్చే ఐదేళ్లకు తగ్గ ప్రణాళిక తన దగ్గర ఉందని రివీల్ చేసాడు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేస్తోన్న `కూలీ` చిత్రం మాత్రం ఎల్ సీయూ నుంచి రావడం లేదు.
ఇది ప్రత్యేకమైన కథ. ఇందులో రజనీకంత్ గోల్డ్ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. గ్యాంగ్ స్టోర్ నేపథ్యంతోనూ కథ ముడి పడి ఉంది. అయితే ఇది మసాలా కమర్శియల్ సినిమా కాదని లోకేష్ స్ట్రాంగ్ గా చెబుతున్నాడు. లాజికల్ గా సాగే ఓ సెన్సిబుల్ కమర్శియల్ సినిమాగా ఉంటుందని కనగరాజ్ తెలిపాడు. అంటే ఈ సినిమా సూపర్ స్టార్ మాస్ ఇమేజ్ కి ..ఎలివేషన్లకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. పూర్తిగా లోకేష్ మార్క్ హీరోని మాత్రమే సినిమాలో హైలైట్ చేస్తాడు.
అలాగని వాళ్ల మాస్ ఫాలోయింగ్ ని పూర్తిగా వదిలినట్లు కాదు. ఆ అంశాన్ని అక్కడక్కాడా టచ్ చేస్తూనే హీరోని తన దారిలోకి తెచ్చుకుని సన్నివేశాలు చేస్తున్నట్లు లెక్క. `ఖైదీ`, `విక్రమ్`, `లియో` ని పరిశీలిస్తే హీరోలకు అవన సరమైన బిల్డప్ సీన్లు ఎక్కడా ఉండవు. ఎలివేషన్లు అసలే ఉండవు. ప్రతీ సన్నివేశం ఎంతో లాజిక్ గా ఉంటుంది. సన్నివేశంలో పాత్ర ఉన్నట్లు ఉంటుంది తప్ప పాత్రలో సన్నివేశం ఉన్నట్లు ఉండదు.
లోకేష్ కనగరాజ్ అదే పార్మాట్ లో కూలీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇలా స్టార్ హీరోలని ఒప్పించడం అంటే చిన్న విషయం కాదు. తమకున్న మాస్ ఫాలోయింగ్, ఫ్యాన్స్ లో క్రేజ్, మాస్ ఎలివేషన్లు అంటూ హీరోలు హడావుడి చేస్తారు. అందులోనూ రజనీకాంత్ తో సినిమా అంటే అలాంటి ఎలివేషన్లు లేకుండా చేయడం అంటే కత్తిమీద సాము లాంటిదే.